హత్య చేసి దుబాయ్ పారిపోయిన నిందితుడు.. కట్ చేస్తే 9ఏళ్ల తరువాత జరిగిందిదే..

| Edited By: Srikar T

Feb 16, 2024 | 7:42 AM

తొమ్మిదేళ్ళ క్రితం జరిగిన హత్య, హత్య యత్నం‎లో A1 నిందితుడు సయ్యిద్ ఇబ్రహీం బెయిల్‎పై విడుదలై దుబాయ్ పారిపోయాడు. ఒకవైపు కోర్టు‎లో కేసు నడుస్తుండగా బెయిల్ పొందినవెంటనే పోలీసులు, కోర్టు అనుమతి లేకుండా గోప్యంగా దుబాయ్ పారిపోయాడు. చాంద్రాయగుట్ట పోలీసులకు పదేపదే కోర్టు ద్వారా సమ్మన్లు రావటంతో పలుసార్లు నిందితుడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు.

హత్య చేసి దుబాయ్ పారిపోయిన నిందితుడు.. కట్ చేస్తే 9ఏళ్ల తరువాత జరిగిందిదే..
Murder Case
Follow us on

తొమ్మిదేళ్ళ క్రితం జరిగిన హత్య, హత్య యత్నం‎లో A1 నిందితుడు సయ్యిద్ ఇబ్రహీం బెయిల్‎పై విడుదలై దుబాయ్ పారిపోయాడు. ఒకవైపు కోర్టు‎లో కేసు నడుస్తుండగా బెయిల్ పొందినవెంటనే పోలీసులు, కోర్టు అనుమతి లేకుండా గోప్యంగా దుబాయ్ పారిపోయాడు. చాంద్రాయగుట్ట పోలీసులకు పదేపదే కోర్టు ద్వారా సమ్మన్లు రావటంతో పలుసార్లు నిందితుడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు. ఎన్ని రోజులైనప్పటికీ నిందితుడు కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బైయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది కోర్టు. ఇదే సమయంలో లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ సంఘటన 2015 లో జరిగింది.

సయ్యద్ ఇబ్రహీం, అలీ అఫారీ, మొహమ్మద్ సాదిక్ లతో గొడవ ప్రాణాలు పోయేలా చేసింది. గొడవ పెద్దదై సయ్యిద్ ఇబ్రహీం అతని మిత్రుడు మొహమ్మద్ మునవార్ ఉల్ హక్‎లు కలిసి అలీ అఫారీ, సాదిక్‎ల పై కత్తితో దాడి చేశారు. అప్పట్లో నిందితులపై 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి, బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అలీ ఆఫారీ మృతి చెందారు. దీంతో ఐపీసీ సెక్షన్ 302 కింద కూడా కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. కొన్ని రోజుల తరువాత బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే ఎవరికీ చెప్పాపెట్టకుండా దుబాబ్ పారిపోయాడు నిందితుడు. తిరిగి తొమ్మిదేళ్ల తరువాత హైదరాబాద్ చేరుకున్నడు. నిందితుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే చాంద్రాయగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్రైం టీం ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..