హైదరాబాద్, ఆగస్టు 15: ప్రజా యుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్రావుకు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఇందుకోసం మంగళవారం ఉదయం చంద్రబాబు గద్దర్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు, గద్దర్ సమాధి దగ్గర నివాళులు అర్పించారు. గద్దర్‌కి నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గద్దర్ తాను అనేక పోరాటాలు కలిసి పనిచేశామని ఆయన గుర్తుకు చేసుకున్నారు.
గద్దర్ పీడిత ప్రజల కోసం అనేక అంశాల మీద పోరాడారన్న చంద్రబాబు, తాను కూడా బీసీల కోసం అలాగో చాలా ఇష్యూస్‌లో ఎస్సీ, ఎస్టీలు బీసీల కోసం ఆదివాసుల కోసం గద్దర్‌తో కలిసి అనేక ఉద్యమాలతో కలిసి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక 1997లో జరిగిన కాల్పుల ఘటన పైన గద్దర్ అనేకసార్లు తనతో మాట్లాడాలని ఇది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. అదంతా కేవలం కొంత మంది కల్పించిన అపోహ మాత్రమే అన్న చంద్రబాబు, అప్పట్లో గద్దర్‌పై కాల్పుల ఘటనను తాను ఖండించినట్లు గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే 1997లో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గద్దర్ పైన కాల్పులు దాడి జరిగిన విషయం తెలిసిందే. గద్దర్ శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంట్లో ఐదు బుల్లెట్లను ఆపరేషన్ తీసి తీయగా ఆరో బుల్లెట్ మాత్రం గద్దర్ వెన్నుపూసలోనే ఉంది. 25 ఏళ్లుంగా గద్దర్ తన బాడీలో ఉన్న తూటాని వెన్నుపూసలో మోస్తూనే దేశం మొత్తం తిరిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు గద్దర్‌పై జరిగిన దాడిని ఖండించలేదని ఇప్పటికీ ప్రజా సంఘాలు విరసం నేతలు విమర్శిస్తూ ఉంటారు.
చంద్రబాబు అండదండలతోనే బ్లాక్ టైగర్స్ పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులే గద్దర్ పైన దాడి చేసి చంపాలని చూశారనే విమర్శ అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొంది. దాదాపు 25 ఏళ్ల పాటు దానికి సంబంధించిన సభ జరిగిన సమయంలో కూడా అక్కడికి వచ్చిన నేతలంతా చంద్రబాబుపై విమర్శలు చేశారు. బతికున్నప్పుడు గద్దర్ కేసులకు సంబంధించి కానీ గద్దర్ పైన దాడి గురించి కానీ స్పందించని చంద్రబాబు నాయుడు ఇప్పుడు గద్దర్ చనిపోయాక ఆయన సమాధికి నివాళులర్పించడం ఏంటని చాలామంది నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పని చేసే సమయంలో గద్దర్ ఎప్పుడు చంద్రబాబును కలవడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే తన పైన కేసులు మోపిందే చంద్రబాబు ప్రభుత్వం అనేది ఆయన పదేపదే వాదించారు. అట్లాంటి చంద్రబాబు ఆయన ఇంటికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం పై విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై చంద్రబాబుట ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..