Telangana: ఎమ్మెల్యేల ప్రలోభాలపై ఎవరి వెర్షన్ వారిదే.. తమకు సంబంధం లేదంటున్న బీజేపీ, కమలం కుట్ర అంటున్న టీఆర్ ఎస్..

|

Oct 26, 2022 | 10:20 PM

హైదరాబాద్ శివారులో ఓ గెస్ట్ హౌస్ లో ముగ్గురు వ్యక్తులు, నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓ జాతీయ పార్టీ భేరసారాలు ఆడిందని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో టీఆర్ ఎస్, బీజేపీ వైఖరి భిన్నంగా ఉన్నాయి. ఇదంతా టీఆర్ ఎస్ డ్రామా అని..

Telangana: ఎమ్మెల్యేల ప్రలోభాలపై ఎవరి వెర్షన్ వారిదే.. తమకు సంబంధం లేదంటున్న బీజేపీ, కమలం కుట్ర అంటున్న టీఆర్ ఎస్..
Kishan Reddy
Follow us on

హైదరాబాద్ శివారులో ఓ గెస్ట్ హౌస్ లో ముగ్గురు వ్యక్తులు, నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓ జాతీయ పార్టీ భేరసారాలు ఆడిందని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో టీఆర్ ఎస్, బీజేపీ వైఖరి భిన్నంగా ఉన్నాయి. ఇదంతా టీఆర్ ఎస్ డ్రామా అని బీజేపీ అంటుంటే, కమలం పార్టీ కుట్ర అని టీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఓ గెస్ట్ వాస్ లో ఇద్దరు స్వామీజీలతో పాటు ఒక బిజినెస్ మ్యాన్, నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమవ్వడం కెమెరాల ముదు అందరికీ కనిపించింది. అయితే ఈ విషయంలో ఎవరి వెర్షన్స్‌ వాళ్లు చెబుతున్నారు. అక్కడ సీన్‌లో దొరికింది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాబట్టి.. సహజంగా బీజేపీపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్ వాళ్లు చెబుతోంది కూడా అదే. బీజేపీ నాయకులే కొనుగోళ్లకు తెరలేపిందన్నది టీఆర్ ఎస్ పార్టీ నేతల ఆరోపణ. వందలకోట్లతో తమ పార్టీ వాళ్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని, కానీ, తమవాళ్లు అమ్ముడుపోకుండా బీజేపీ కుట్రలను బయటపెట్టారని చెప్పుకుంటోంది టీఆర్ఎస్‌. ఇక ఇదే అంశాన్ని బీజేపీ టీఆర్‌ఎస్‌ డ్రాగాగా చెబుతోంది.

ముందునుంచీ బీజేపీ కొనుగోళ్లు జరుపుతుందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దాన్ని నిజం అని చెప్పేలే ఓ డ్రామా క్రియేట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా గులాబీ పార్టీదే అని ప్రతివిమర్శలు చేస్తున్నారు. మధ్యవర్తులుగా వచ్చిన వ్యక్తుల్లో ఓ పర్సన్ నందు. అతను కిషన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. అయితే మధ్యవర్తులుగా వచ్చిన వ్యక్తులు ఎవరో, ఎందుకొచ్చారో కూడా తెలీదంటున్నారు కిషన్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్న టైమ్‌లో ఎవరో, ఎవరెవరో ఫోటోలు దిగారని.. వాటిని ప్రయోగించి నిందలు బీజేపీపై వెయ్యొద్దంటున్నారు. ఎమ్మెల్యేల ప్రలోభాలు జరిగాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.

పోలీసులు కూడా భేరసారాలు జరుగుతున్నాయన్న సమాచారం తమకు వచ్చిందని, దీంతో తాము దాడులు చేశామంటున్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందంనేది తేల్చాల్సింది మాత్రం పోలీసులే. మనుషుల్ని పట్టుకున్నారు. మధ్యవర్తులను పట్టుకున్నారు. ప్రలోభాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వచ్చి దాన్ని నిర్దారించామని, మిగతా విషయాలన్నీ దర్యాప్తు తర్వాత చెబుతామని అంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..