Telangana: తెలంగాణ IAS, IPSలకు కేంద్రం బిగ్ షాక్.. ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందేనంటూ..

|

Oct 10, 2024 | 8:15 PM

సొంతరాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ.. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది కేంద్రం. కేడర్‌ మార్పు కోసం చేసుకున్న విజ్ఙప్తిని తిరస్కరించడమే కాదు.. ఈనెల 16లోపు రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Telangana: తెలంగాణ IAS, IPSలకు కేంద్రం బిగ్ షాక్.. ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందేనంటూ..
Telangana
Follow us on

సొంతరాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ.. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది కేంద్రం. కేడర్‌ మార్పు కోసం చేసుకున్న విజ్ఙప్తిని తిరస్కరించడమే కాదు.. ఈనెల 16లోపు రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తెలంగాణల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గట్టి షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను ఖరాఖండిగా తిరస్కరించింది. కేటాయించిన కేడర్ రాష్ట్రాల్లోనే కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది.

విభజన సమయంలో ఏపీ కేడర్‌కి చెందిన 12 మంది తెలంగాణకు అలాటయ్యారు. అందులో ఒకరు సెంట్రల్‌ సర్వీసెస్‌లో పనిచేస్తుండగా… సోమేష్‌తో పాటు మరో ఇద్దరు రిటైరయ్యారు. ఇక మిగిలిన ఎనిమిదిలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, వాణీప్రసాద్‌, మల్లెల ప్రశాంతితో పాటు ముగ్గరు ఐపీఎస్‌లు అంజనీ కుమార్‌, అభిషేక్‌ మొహంతి, అబిలాష్‌ బిస్త్ ఉన్నారు. వీరంతా తెలంగాణలోనే కొనసాగుతామంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే, వీరి అభ్యర్థనను కొట్టిపారేసిన కేంద్రం… వీరందర్నీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కి వెళ్లాలని ఆదేశించింది. అంతేకాదు తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16వ తేదీలోగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చింది.

ఇక ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, అనంతరాము, సృజన, శివశంకర్ లోతేటిలకూ నోటీసులు అందాయి. వెంటనే తెలంగాణలో రిపోర్ట్‌ చేయాలంటూ ఈ నలుగురిని ఆదేశించింది డీవోపీటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ప్రత్యూష సిన్హా కమిటీని వేసి.. ఏపీ, తెలంగాణలకు అధికారులను సర్దుబాటు చేసింది కేంద్రం. అయితే ఆ సమయంలో కొంత మంది అధికారులు మాత్రం అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను కేడర్‌ మార్చాలంటూ కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను కూడా ఆశ్రయించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన క్యాట్, అప్పట్లో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే క్యాట్‌ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. గత మార్చి నెలలో దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో అభ్యంతరాల పరిశీలనకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దీపక్‌ను నియమించింది కేంద్రం. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం, అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లుగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు ఆదేశాలందాయి. వారం రోజుల్లోపే రిపోర్ట్‌ చేయాలంటూ నోటీసులొచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..