AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు కేంద్రం సూపర్ న్యూస్.. ప్రత్యేక నిధులు విడుదల.. గ్రామాలకు పండుగే..

తెలంగాణలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రత్యేక గ్రాంట్ల నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఠం సిఫార్సుల మేరకు వీటిని విడుదల చేసింది. తెలంగాణలోని మరో ఆరు రాష్ట్రాలకు కూాడా గ్రాంట్లను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: తెలంగాణకు కేంద్రం సూపర్ న్యూస్.. ప్రత్యేక నిధులు విడుదల.. గ్రామాలకు పండుగే..
telangana
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 4:34 PM

Share

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ.1500 కోట్లకుపైగా గ్రాంట్లు రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణలోని పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్ టైడ్ గ్రాంట్స్ కేటాయించారు. ఈ నిధులు రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలకు ఉపయోగించనున్నారు. గ్రామాల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్, పారిశుద్ద్యం లాంటి మౌలిక సదుపాయాలు ఆ నిధులతో కల్పించనున్నారు. రాష్ట్రంలోని 12600 గ్రామ పంచాయతీలకు వీటిని వినియోగించనున్నారు.

కేంద్రం కొత్త నిబంధన

ఉద్యోగుల జీతాలకు కాకుండా పంచాయతీల్లో అభివృద్ది పనులకు మాత్రమే ఈ నిధులు ఉపయోగించాలని కేంద్రం నిబంధన విధించింది. ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ది పనులు పరుగులు పెట్టనున్నాయి. గ్రాంట్ల విడుదలకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత గ్రాంట్స్‌ను ఇప్పుడు విడుదల చేసింది. ఈ గ్రాంట్స్‌ను గ్రామ సభ ఆమోదంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మురుగు కాల్వల మరమ్మత్తులు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, శ్మసాన వాటికల నిర్మాణం వంటి పనులకు ఉపయోగించనున్నారు. సిబ్బంది జీతాలు, ఆఫీసుల ఖర్చచులకు వీటిని ఉపయోగించకూడదు. ఈ నిధులను కేంద్రం నేరుగా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది.

ప్రతీ రూపాయి ఆడిట్

నిధులు అక్రమదారి పట్టకుండా కేంద్రం కఠిన నిబంధలను తీసుకొచ్చింది. ప్రతీ రూపాయి ఆడిట్ చేయాలి. అలాగే ఆన్‌లైన్‌లో గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది కార్యక్రమాల గురించి నమోదు చేయాలి. ఇక ప్రభుత్వం ఈ నిధులను గ్రామ పంచాయితీలకు బదిలీ చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చేయాలి. అయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిడయంతో సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు ఉన్న రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. సర్పంచ్‌లు రావడంతో గ్రామాల్లోని అభివృద్ది పనుల్లో వేగం పుంజుకుంది.

Follow Us