MLC Kavitha: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై వీడియో రిలీజ్‌ చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏం చెప్పారంటే?

|

Mar 22, 2023 | 7:57 PM

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మరోసారి ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మహిళలు అడ్డంకులను ఛేదించి తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళా సాధికారత కోసం కలిసి పనిచేద్దామంటూ పిలుపు నిచ్చారు.

MLC Kavitha: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై వీడియో రిలీజ్‌ చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏం చెప్పారంటే?
Mlc Kavitha
Follow us on

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మరోసారి ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మహిళలు అడ్డంకులను ఛేదించి తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళా సాధికారత కోసం కలిసి పనిచేద్దామంటూ పిలుపు నిచ్చారు. మహిళలు నింగిలో సగం, నేలలో సగం, జనాభాలో సగం. కానీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను మాత్రం సాధించలేకపోయామని అన్నారు కవిత. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుదామంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ . తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని క‌విత  కోరారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా లిక్కర్‌ స్కామ్‌లో వరుసుగా రెండు రోజుల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న కవిత హైదరాబాద్ వచ్చారు. అనంతరం గత 3 రోజులుగా ఢిల్లీలో జరిగిన పరిణామాలపై C M కేసీఆర్‌తో చర్చించారు.ఈడీ విచారణ అంశాలను సీఎంకు వివరించారు. ఇకపై విచారణ తీరు ఎలా ఉండబోతుంది? 24న సుప్రీం ఇచ్చే తీర్పు, వాదనలు ఎలా ఉండాలన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది..BJPని రాజకీయంగా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను న్యాయపరంగా..ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..