Telangana: ‘స్మార్ట్ ఫోన్ వద్దు.. డబ్బా ఫోనే ముద్దు.!’ వాళ్లంతా ఇంటర్నెట్ వద్దే.. వద్దంటూ..
అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు కొత్త ఫోన్‌లు కొంటున్నారట. కొత్త ఫోన్‌లు అంటే లక్షల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్‌లు అనుకుంటే పప్పులో కాలేసినట్టే వెయ్యి, రెండు వేలు పెట్టి అసలు ఇంటర్నెట్ లేని పాతకాలం నాటి చిన్న చిన్న ఫోన్లు కొంటున్నారు. అదేంటి.! అధికార పార్టీ ఎమ్మెల్యే ఏంది..

అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు కొత్త ఫోన్‌లు కొంటున్నారట. కొత్త ఫోన్‌లు అంటే లక్షల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్‌లు అనుకుంటే పప్పులో కాలేసినట్టే వెయ్యి, రెండు వేలు పెట్టి అసలు ఇంటర్నెట్ లేని పాతకాలం నాటి చిన్న చిన్న ఫోన్లు కొంటున్నారు. అదేంటి.! అధికార పార్టీ ఎమ్మెల్యే ఏంది.. సన్న పిన్ను ఛార్జర్ ఫోన్‌లు ఎందుకు కొంటున్నారు. ఈ కాలంలో ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు బడా బడా కార్లు, లక్షల రూపాయల ఫోన్‌లు మెయింటైన్ చేయడం సాధారణ విషయమే.. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా పాతకాలం ఫోన్‌ల వెంట పడ్డారట.
ఆండ్రాయిడ్ ఫోన్, ఆపిల్ ఫోన్‌లను పీఏలు, గన్‌మెన్‌లకిచ్చి చిన్న ఫోన్‌లను లీడర్లు తమ వద్ద ఉంచుకుంటున్నారట. ఆ ఫోన్‌లలో ఉండే నెంబర్ కూడా ఎవరికి పడితే వారికి ఇవ్వడం లేదంట. వాళ్ల ఇంట్లో కూడా ఈ విషయం తెలియదని సమాచారం. అన్ని ఫోన్‌లను సైలెంట్‌లో ఉంచినా.. స్విచ్ ఆఫ్ చేసినా.. ఆ చిన్న ఫోన్‌ను మాత్రం పెద్ద రింగ్ టోన్‌లో పెట్టుకుని.. పై జేబులో పెట్టుకుంటున్నారట. ఎప్పుడు మోగుతది.. ఎప్పుడు ఎత్తుదమా అని ఎదురు చూస్తున్నారట.
చిన్న ఫోన్‌ల స్టోరీ వెనక లీడర్లది పెద్ద ప్లానే ఉందట. ఆ ఫోన్‌లలో ఉండే నెంబర్ కేవలం పార్టీలోని కీలక నాయకులకే ఇచ్చారంట. ఎన్నికల టైం కాబట్టి.. అక్కడి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా.. ఠక్కున కలిసేలా ఇలాంటి ప్లాన్ వేశారని తెలుస్తోంది. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడైనా ఫోన్ రావొచ్చు. చిన్న ఫోన్‌లైతే.. సిగ్నల్స్ ఉండటమే కాకుండా.. పైజేబులో పెట్టుకోవడం కూడా ఈజీ కావడంతో లీడర్లు ఇలా ప్లాన్ చేశారట. స్మార్ట్ ఫోన్‌లు ఉన్నా.. ఈ కొద్దీ రోజులు మాత్రం చిన్న ఫోన్‌లకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారంట. స్మార్ట్ ఫోన్ల వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సకాలంలో ఫోన్‌లు ఎత్తక చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు. ప్రగతి భవన్‌కు అందుబాటులో ఉండాలంటే చిన్న ఫోన్‌లకు మించినది లేదని కొందరు మంత్రులు ఫాలో అవుతున్న ఈ పద్దతి చూసి.. మిగతా వారంతా అదే పాటిస్తున్నారు.