Telangana: పార్టీలో గుంటనక్కలు, చీడ పురుగులు.. BRS ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీకి చెందిన నియోజకవర్గ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అక్కడక్కడా కొండెoగలు, గుంటనక్కలు, చీడ పురుగులు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.

Updated on: May 20, 2023 | 12:38 PM

సొంత పార్టీకి చెందిన జనగామ నియోజకవర్గ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అక్కడక్కడా కొండెoగలు, గుంటనక్కలు, చీడ పురుగులు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. వాటి కాళ్లు, చేతులు విరిచేస్తానని స్వయంగా సీఎం చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎదుట నీచ రాజకీయాలు సాగవన్నారు. తన పనితీరు బాగుందని సాక్షాత్తు సీఎం చెప్పారన్నారు. ప్రజల మధ్య తిరిగి, ప్రజల పక్షాన నిలబడితేనే ఆదరిస్తారన్నారు. 2014లో, 2018లో తనకు టికెట్​ రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఉన్నంతకాలం తాను జనగామ రణ క్షేత్రంలోనే ఉంటా.. ప్రజలకు సేవ చేస్తానన్నారు. బీఆర్ఎస్ మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా ఎలాంటి పనులు చేపట్టినా, అధికారిక పర్యటనలు చేసినా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనగామ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..