Telangana: ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. జాతీయస్థాయి నేతలకు కేసీఆర్ ఆహ్వానం..

టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీగా ప్లాన్ చేస్తుంది. పార్టీ సత్తా చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిసింది.

Telangana: ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. జాతీయస్థాయి నేతలకు కేసీఆర్ ఆహ్వానం..
BRS

Updated on: Jan 09, 2023 | 7:42 AM

Bharat Rashtra Samithi: రైతు, రాజకీయ చైతన్య గడ్డ ఖమ్మం జిల్లా వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరిస్తుంది. ఈ నెల 18న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో భారీగా ప్లాన్ చేస్తుంది. పార్టీ సత్తా చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిసింది. సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు జాతీయస్థాయి నేతలను సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, కేరళ సీఎం పినరాయి విజయన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ సభకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

బహిరంగ సభల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు బలంగా వినిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఖమ్మంలో నిర్వహించే సభ ద్వారా దేశ రాజకీయాలకు కేసీఆర్ శంఖారావం పూరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..