
ఢిల్లీ లిక్కర్ స్కాం.. తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. భారత జాగృతి ఆధ్వర్యంలో మహిళా బిల్లుపై ఢిల్లీలో దీక్షకు సిద్ధమైన తరుణంలో.. రేపే విచారణకు రావాలని ఆదేశించడం సంచలనం రేపుతోంది. కాగా.. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రజావ్యతిరేక, అణచివేత చర్యలకు కవిత తలవంచదన్నారు. బెదిరింపులతో కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానన్నారు. రేపటి విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయసలహా తీసుకుంటానన్నారు.
కాగా, కవితకు ఈడీ నోటీసులివ్వడం కక్షసాధింపుచర్యలేనంటూ BRS నేతలు.. BJP పై మండిపడుతున్నారు. ఉమెన్స్ డే రోజున కవితకు ఈడీ నోటీసులివ్వడం దుర్మార్గమని ఫైరవుతున్నారు. మహిళలతో పెట్టుకుంటే ఎవరూ మిగలరంటున్న గులాబీ నేతలు..మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి. చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూనే.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. సర్కారుపై తిట్ల దండకంతో అందుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల పదజాలం అసహ్యంగా ఉందన్నారు.
కవితకు ఈడీ నోటీసులు దుర్మార్గమన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్. బీజేపీ అరాచకాలకు ఇది పరాకాష్ఠ అన్నారు. మోదీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని.. కేసులు, అణచివేతలు కేసీఆర్‌ను ఏమీ చేయలేవన్నారు. బీజేపీ అసలు రూపాన్ని త్వరలోనే ప్రజలముందు పెడతామన్నారు.
కేంద్రాన్ని ప్రశ్నించినందుకే కేసులతో బెదిరిస్తున్నారని.. కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడబోమని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు బీజేపీ పతనానికి నాంది అంటూ విమర్శించారు. ఉమెన్స్ డే రోజు మహిళపై కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమంటూ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
BRSను కేంద్రం టార్గెట్ చేసింది.. రాజకీయ కారణాలతోనే కవితకు ఈడీ నోటీసులిచ్చిందని గంగుల కమలాకర్ విమర్శించారు. లిక్కర్ స్కాంలో కవితకు సంబంధం లేకపోయినా.. ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు
ఓ మహిళపై కేంద్రం కక్షసాధిస్తోందన్నారు ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, దానం నాగేందర్. మహిళా దినోత్సవాన ఇలా నోటీసులివ్వడం సరికాదన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించినందుకే కక్షకట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు ఆరోపించారు. కవితపై కక్షసాధింపును ప్రతి మహిళ ఖండించాలని పిలుపునిచ్చారు.
కవితకు నోటీసులివ్వడం తొలిసారేం కాదన్నారు బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. దర్యాప్తులో భాగంగా అనేకమంది పేర్లు వచ్చాయని..కోర్టు పర్యవేక్షణలో కేసు నడుస్తున్నట్లు చెప్పారు. లిక్కర్ స్కాం కేసుతో రాజకీయపార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించారు.
లిక్కర్‌స్కాం కేసులో అనేక అనుమానాలున్నాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్. రాజకీయ లబ్ధికోసమే అరెస్టులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. బీజేపీ బలోపేతానికే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటిల రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉండడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. కవితకు ఈడీ నోటీసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా దినోత్సవాన రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇదంతా జరుగుతోందని BRS అంటుంటే.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెబుతోంది BJP. మొత్తంగా ఈడీ నోటీసుల వ్యవహారం జాతీయస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..