Telangana Election: ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో నరాలు తెగే ఉత్కంఠ.. అసలేం జరిగిందంటే.?

Telangana Election 2023: ఆ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. వారికి బీఫామ్స్‌ను కూడా అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆ ఒక్క నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటివరకు అసలు అభ్యర్థి ఎవరు అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉందట. దీనితో అక్కడి బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతూపోతోంది. ఇంతకీ అది ఏ నియోజకవర్గం ఏంటో తెలుసుకుందామా..

Telangana Election: ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో నరాలు తెగే ఉత్కంఠ.. అసలేం జరిగిందంటే.?
BRS Party

Edited By:

Updated on: Oct 16, 2023 | 7:18 PM

నర్సాపూర్, అక్టోబర్ 16: ఆ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. వారికి బీఫామ్స్‌ను కూడా అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆ ఒక్క నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదట. ఇప్పటివరకు అసలు అభ్యర్థి ఎవరు అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉందట. దీనితో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతూపోతోంది. ఇంతకీ అది ఏ నియోజకవర్గం.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు రోజురోజుకూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుందట. ఓ వైపు జిల్లాలో ఉన్న అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్స్ ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్.. ఒక్క నర్సాపూర్ నియోజకవర్గం విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు స్థానిక నేతలు. మొన్నటి వరకు కొంత నార్మల్‌గానే ఉన్నప్పటికీ.. మిగతా వారికి బీ-ఫామ్స్ ఇవ్వడంతో తమ పరిస్థితి ఏంటి అని బాగా టెన్షన్ పడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆశిస్తున్నారు. అందులో ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాగా.. మరొకరు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి. వీరిద్దరి మధ్య పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఈ నియోజకవర్గం టికెట్‌ను హోల్డ్‌లో పెట్టింది. టికెట్ విషయంలో ఎమ్మెల్యే వర్గం కొంత దూకుడుగా వ్యవహరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఇంకా పెండింగ్‌లో పెట్టారని పలువురు నేతల చెప్పుకుంటున్నారు.

నర్సాపూర్ నియోజకవర్గంతో పాటు జనగామ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అక్కడ లైన్ క్లియర్ అయ్యింది. కానీ నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇక్కడి నేతలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే మదన్ రెడ్డిని, సునీత లక్ష్మారెడ్డిని ప్రగతి భవన్‌కి పిలిచి ఇద్దరితో చర్చలు కూడా జరిపారు సీఎం కేసీఆర్. దీంతో అందరూ పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్ టికెట్ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని భావించారు. కానీ ఇప్పటివరకు దానిపై ఊసే లేదు. మొదటి నుంచి సునీత లక్ష్మారెడ్డితో పాటు ఆమె అనుచరులు కూడా టికెట్ విషయంలో తొందరపడి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గం మాత్రం ఆయనకు మళ్లీ టికెట్ రావాలని నియోజకవర్గ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేశారు. ఎప్పుడైతే ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిందో అప్పటి నుంచి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా టోటల్‌గా సైలెంట్ అయ్యారు.

మరోవైపు నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్‌పై ఎవరికి వాళ్లు తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు.  అలాగే పార్టీ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతోందన్నది కూడా క్లారిటీ లేకపోవడంతో అసలు నర్సాపూర్ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. అటు ఎమ్మెల్యే అనుచరులు, ఇటు సునీత లక్ష్మారెడ్డి అనుచరులు వారి వద్దకు వెళ్లి టికెట్ గురించి అడిగితే.. ఒకటి రెండు రోజుల్లో అయిపోతుంది అని గత నెల రోజులుగా చెబుతున్నారు. ఇక జిల్లా మొత్తం క్లియర్ చేసి ఈ ఒక్క నర్సాపూర్ టికెట్‌ను అధిష్టానం ఎందుకు ఆపిందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు అక్కడి నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..