BRS Party: రాజ్యసభకు బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు నామినేషన్, మార్మోగిన తెలంగాణ నినాదాలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మరోసారి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా డాక్టర్ బండా ప్రకాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మరోసారి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు. గురువారం రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా డాక్టర్ బండా ప్రకాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా, ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికలు రావడంతో వద్దిరాజు అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖరారు చేశారు. ఎంపీ రవిచంద్ర తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు.
సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్ నాయక్, బానోతు హరిసింగ్ నాయక్, గాంధీనాయక్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి బయలుదేరారు. రవీంద్రభారతి వద్ద మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు రౌతు కనకయ్య తదితరులు కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వద్దిరాజు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా “జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు”,”జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”అనే నినాదాలు హోరెత్తాయి.
ఆ తర్వాత రవిచంద్ర రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ నుంచి కాలినడకన శాసనమండలికి చేరుకోగా ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, సిరికొండ మధుసూదనాచారి,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యేలు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్,కడియం శ్రీహరి, తన వెంట రాగా గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ కు రాజ్యసభ సీట్లు మూడు ఉండగా, ఇప్పటికే రేణుకా చౌదరి, అనిల్ కుమార్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.