Rain Alert: వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఈశాన్యంలో ఈడ్చికొడుతున్న వానలతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీచేయడం అక్కడి భీకర పరిస్థితులకు అద్దం పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి.? ఇవాళ వాతావరణం ఎలా ఉండబోతోంది.! ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు

Rain Alert: వచ్చే 2 రోజులు వాతావరణం ఇలా.. తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదిగో
North West Monsson

Updated on: Jun 02, 2025 | 7:45 AM

మండు వేసవిలో ముంచెత్తిన వానలు ఒక్కసారిగా వాతావరణాన్ని కూల్‌గా మార్చేశాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ(సోమవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందంది.

ఇక తెలంగాణ వెదర్ విషయానికొస్తే.. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం గరిష్టంగా నల్గొండలో 39.5 డిగ్రీలు, కనిష్టంగా మహబూబ్‌నగర్‌లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి