వీద్దరూ కూడా పుట్టుకతోనే అంధులు అయినప్పటికీ రాముల వారి మీద భక్తితో బ్రెయిలి లిపి ద్వారా సుదర్శన శతకాన్ని అవలీలగా చదివేస్తున్నారు. రెండు కళ్లు కనిపించకపోయినా భద్రాద్రి రాముల వారి మీదున్న వీరి భక్తిని, సుదర్శన శతకం పుస్తకాన్ని చదివే తీరును చూసిన ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులయ్యారు. హైదరాబాదుకు చెందిన నగేష్ రామానుజ దంపతులు .. భద్రాచలం రామాలయంలో రామాయణ పారాయణం అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగేష్ రామానుజ దాసు దంపతులు 2002 సంవత్సరంలో చిన్న జీయర్ స్వామి మంగళశాసనాలతో డీఎస్సీలో సెలక్ట్ అయి సోషల్ టీచరుగా జగద్గిరి నగర్ మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నారు. చిన్న జీయర్ స్వామి వద్ద 1994 లో స్వామివారి వద్ద ఉపదేశం తీసుకొని స్వామివారి అనుగ్రహంతో సుదర్శన శతకం అనే పుస్తకాన్ని బ్రెయిన్ లిపిలో ప్రింట్ చేసి మాకు అందించడం జరిగిందని చెప్పారు.
అప్పటినుండి ఈ శతకాలను లిపి ద్వారా పఠిస్తున్నట్లు వెల్లడించారు ఈ దంపతులు. అంతేకాదు చిన్న జీయర్ స్వామి అందుల కోసం బ్రెయిన్ లిపి స్కూల్ , కళాశాలను పెట్టడం జరిగిందని అప్పటి నుండి ఈ లిపి ద్వారా సుదర్శన శతకాన్ని చేతిస్పర్శతో చదవటం జరుగుతుందని వివరించారు నగేష్ రామానుజ దాసు దంపతులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..