
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్ర శివారులోని వ్యవసాయ పొలాల వద్ద క్షుద్రపూజలు కలకలం రేపాయి. భయంకర దృశ్యాలు కనబడ్డాయి. వివిధ రకాల పూజాలు ఆనవాళ్లు ఉన్నాయి. మనిషి రూపంలో ఉన్న బొమ్మ, నిమ్మకాయలు, పూజా సామాగ్రి కనబడింది. పచ్చని పొలం దగ్గర కుంకుమతో నింపారు. ఇక్కడ క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. మనిషి బొమ్మ, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, ఇతర సామాగ్రి చూసి స్థానిక రైతులు భయపడ్డారు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి పూజలు చేయడంతో ఇక్కడ ఏదో జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నెల రోజుల క్రితం అమావాస్య రోజున కూడా ఇలాగే క్షుద్రపూజలు చేశారు. ఇటు వైపుగా రైతులు వెళ్లడానికి జంకుతున్నారని.. ఇలాంటి దృశ్యాలు నిత్యం కనబడటంతో పని చేయడానికి కూలీలు కుడా రావడం లేదు. ఇలాంటి పూజలకు ఎవరు పాల్పడుతున్నారో తెలుసుకొని వారిని శిక్షించాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా అమావాస్య వస్తే చాలు.. ఇక్కడ భయంకరమైన వాతావరణం కనబడుతుంది. ఇలాంటి పూజలు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.