Huzurabad: హుజూరాబాద్, బద్వేల్ బైపోల్స్‌లో వారిదే విజయం.. పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

| Edited By: Anil kumar poka

Oct 26, 2021 | 1:40 PM

ఏపీలో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పెదవివిరిచారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కోరడం..

Huzurabad: హుజూరాబాద్, బద్వేల్ బైపోల్స్‌లో వారిదే విజయం.. పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
Daggubati Purandeswari
Follow us on

ఏపీలో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పెదవివిరిచారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ నేతల బృందం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కోరడం.. అటు టీడీపీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ ఈసీని కోరడంపై ఆమె స్పందించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పార్టీలు.. వ్యక్తిగత కక్షలతో ముందుకెళ్తుండటం బాధాకరమన్నారు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించాయంటూ పరోక్షంగా వైసీపీ, టీడీపీలపై ఆమె విమర్శలు గుప్పించారు.

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కృషి చేస్తున్నట్లు చెప్పారు.  బద్వేల్‌లో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని ఆశాభావం వ్యక్తంచేశారు. హుజూరాబాద్‌‌లో బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30 జరగనుండగా.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండు చోట్లా రేపటితో ఉపఎన్నిక ప్రచారానికి ఎండ్ కార్డ్‌ పడనుంది. ఈసారి సైలెన్స్ సమయాన్ని 48గంటల నుంచి 72గంటలకు పెంచడంతో బుధవారం సాయంత్రం 5గంటలకే మైకులు మూగబోనున్నాయి.

Also Read..

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…. తెలుగులో మోహన్ బాబు సరసన ఈ అమ్మడు నటించిన సినిమా సూపర్ హిట్..

Telangana: తెలంగాణలో వ్యాక్సినేషన్ తీసుకోనివారికి హెచ్చరిక.. రేషన్, పెన్షన్ కట్..