Telangana BJP: ఆ 22 మంది ఎవరు..? బీజేపీ దూకుడు.. వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

Telangana BJP Politics: తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం ముందే నిర్వహిస్తున్నాయి. ఎవరికి వాళ్లు జిల్లాల పర్యటనలు చేస్తూ.. పార్టీ శ్రేణులను అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనికి తోడు.. బీజేపీకి బూస్ట్‌ నింపేందుకు అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారు.

Telangana BJP: ఆ 22 మంది ఎవరు..? బీజేపీ దూకుడు.. వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు
Telangana BJP Chief Kishan Reddy

Updated on: Aug 19, 2023 | 8:15 AM

Telangana BJP Politics: తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం ముందే నిర్వహిస్తున్నాయి. ఎవరికి వాళ్లు జిల్లాల పర్యటనలు చేస్తూ.. పార్టీ శ్రేణులను అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనికి తోడు.. బీజేపీకి బూస్ట్‌ నింపేందుకు అమిత్‌ షా తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..పార్టీలోకి భారీగా నాయకులను చేర్పించి కొత్త ఉత్సాహాన్నివ్వాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. దీనికోసం ఇప్పటికే కొంతమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.

ఆ 22 మంది ఎవరు..?

త్వరలోనే 22 మంది ప్రముఖులు బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. అమిత్‌ షా సమక్షంలో కొందరు, మరికొందరు నేతల సమక్షంలో మరికొందరు చేరతారని రాజేందర్‌ నిర్మల్‌లో తెలిపారు. అంతే కాదు ఇకపై నిత్యం చేరికలు ఉంటాయని ప్రకటించారు.

అమిత్‌ షా సభ ఏర్పాట్లపై పరిశీలన

తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా.. ఖమ్మం జిల్లాకు వెళ్లారు.. ఖమ్మంలో జరిగే అమిత్ షా సభ ఏర్పాట్లు, జన సమీకరణపై బీజేపీ నేతలతో చర్చించారు కిషన్‌రెడ్డి. అమిత్‌ షా సమక్షంలో బీజేపీలోకి చేరికలు మరింత పెరుగుతాయని.. త్వరలో ఖమ్మం జిల్లాలోనూ చేరికలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, నిర్మల్ మాస్టర్ ప్లాన్‌పై రాజకీయ రగడ కొనసాగుతున్న టైమ్‌లో అక్కడికెళ్లిన ఎమ్మెల్యే రఘునదన్‌ రెడ్డి కూడా 22 మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. మొత్తంమీద తెలంగాణలో అమిత్‌ షా టూర్‌కు ముందు బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. కొత్త వలసలపై ముహూర్తం ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉంది.

మొత్తానికి ఎన్నికలు సమీపిస్తుండటంతో కమలదళం సన్నద్ధమవుతోంది. దీనికోసం అధిష్టానం సూచనలతో ఎప్పటికప్పుడు కార్యచరణను వేగవంతం చేస్తోంది. కాగా, అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీలో మరింత జోష్ ఉండనుందని పేర్కొంటున్నారు కార్యకర్తలు.. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నేతలతో భేటీ అయిన అధిష్టానం.. పలు సూచనలు కూడా చేసింది. దీని ప్రకారం.. కాషాయ పార్టీ నేతలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..