DK Aruna: అల్లు అర్జున్‌ పావు మాత్రమే.. దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ

అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసు పొలిటికల్ టర్న్‌ తీసుకుంది. ఈ ఘటన వెనక రాజకీయ కుట్ర ఉందని దాడి చేసిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉంటే.. అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.

DK Aruna: అల్లు అర్జున్‌ పావు మాత్రమే.. దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
Dk Aruna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 23, 2024 | 7:03 PM

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి ఘటన పొలిటికల్ టర్న్‌ తీసుకుంది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నానంటూ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కొడంగల్ ప్రాంతానికి చెందిన వారు నలుగురు ఉన్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. దాడి ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని అరెస్టైన నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ అభ్యర్థి ఉన్నారని డీకే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వమే కావాలని దాడిని ప్రేరేపించిందని.. దీనివెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను బలిపశువు చేయడం సరికాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కుట్రలో అల్లు అర్జున్‌ పావు మాత్రమేనని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. అల్లు అర్జున్‌ కూడా ఇలాంటి ఘటన జరగాలని కోరుకోరని, ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేసి వాడుకోవడం సరికాదని డీకే అరుణ పేర్కొన్నారు. కాగా.. జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులను డీకే అరుణ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్..

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు హాజరు పరిచారు. ఆరుగురు నిందితులకు ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకున్న నిందితులు ఆరుగరు అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు నిందితులు ప్రహరీ గోడ ఎక్కి నటుడి ఇంట్లోకి టమాటాలు విసిరారు. అంతటితో ఆగకుండా పూల కుండీలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ పరామర్శించి వారికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీతేజ్ ను అమెరికాకు పంపించి మెరుగైన వైద్య చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో