Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: మీకు కొత్త పాన్‌ కార్డ్‌ కావాలా..? కేవలం 10 నిమిషాల్లోనే.. ఎలాగంటే..

PAN Card: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. ఎందుకంటే బ్యాంకు ఖాతా తీయాలంటే ముందుగా పాన్‌ అవసరం. అంతే కాకుండా వివిధ రకాల లావాదేవీలను నిర్వహించేందుకు పాన్‌ అవసరం. అయితే కొత్త పాన్‌ కార్డు కావాలంటే కేవలం పది నిమిషాల్లోనే పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం..

PAN Card: మీకు కొత్త పాన్‌ కార్డ్‌ కావాలా..? కేవలం 10 నిమిషాల్లోనే.. ఎలాగంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Mar 14, 2025 | 6:19 PM

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ తప్పనిసరైపోయింది. ఇది లేనిది ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. అంటే అకౌంట్‌ తీయాలన్నా, రూ.50వేలకుపైగా లావాదేవీలు చేయాలన్నా పాన్‌కార్డు తప్పనిసరి కావాల్సిందే. అయితే కొందరికి అర్జెంట్‌గా పాన్ కార్డ్ కావాల్సి వస్తుంది. కానీ అంత ఫాస్ట్‌గా పాన్ కార్డ్ తీసుకోవడం కుదరదని, కొత్త పాన్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాలని అనుకుంటారు. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు 10 నిమిషాల్లోనే పాన్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో అందుకోవచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ “ఇన్‌స్టంట్ ఇ-పాన్” (Instant e-PAN) సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ సమయంలో పాన్ కార్డు పొందవచ్చు. ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని కేవలం పది నిమిషాల్లోనే పాన్‌ కార్డు పొందండి.

ఇది కూడా చదవండి: Financial Planning: స్కీమ్‌ అంటే ఇది కదా మావ.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.3.60 కోట్లు పొందే ఛాన్స్‌!

ఇ-పాన్ కోసం దరఖాస్తు చేయడం ఎలా?:

  1. ముందుగా ఆన్‌లైన్‌లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ https://www.incometax.gov.in కి వెళ్లాలి.
  2. హోమ్‌పేజీలో ‘క్విక్ లింక్స్’ (Quick Links) సెక్షన్ కనిపిస్తుంది. అందులో ‘ఇన్‌స్టంట్ ఇ-పాన్’ (Instant e-PAN) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  3. మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో మొదటిది “గెట్ న్యూ e-PAN”. ఇది కొత్త పాన్ కోసం అప్లై చేయడానికి. రెండోది ‘చెక్ స్టేటస్/డౌన్‌లోడ్ PAN’, ఇది దరఖాస్తు చేసిన పాన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఇదివరకే జారీ చేసిన పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి పనికొస్తుంది. కొత్త పాన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి “గెట్ న్యూ e-PAN” (Get New e-PAN)పై క్లిక్ చేయాలి.
  4.  మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను టైప్ చేసి, ‘టర్మ్స్ సౌండ్ కండిషన్స్’ బాక్స్‌ను టిక్ చేసి ‘కంటిన్యూ’పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి ‘కంటిన్యూ’పై నొక్కాలి.
  5. వెబ్‌సైట్ మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌, ఫోటో ఆధార్ నుంచి ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఆ వివరాలను సరి చూసుకొని కంటిన్యూ’పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా అడగవచ్చు. ఇది తప్పనిసరి కాదని గుర్తించుకోండి. మీ ఇష్టం వస్తే ఇవ్వచ్చు.. ఇవ్వకపోవచ్చు. ఆ తర్వాత ఇ-పాన్ జనరేట్ అవుతుంది.
  6. వెరిఫికేషన్ సక్సెస్ అయితే, ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. కొన్ని నిమిషాల్లో ఇ-పాన్ సిద్దమైపోతుంది. ఇది రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు పంపిస్తారు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటుంది.

డౌన్‌లోడ్‌ చేయడం ఎలా?

ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మళ్లీ Instant e-PAN సెక్షన్‌కి వెళ్లి చెక్ స్టేటస్/ డౌన్‌లోడ్ PANపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత, ఇ-పాన్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్‌లోడ్‌ అయ్యేందుకు కేవలం పది నిమిషాలు పడుతుంది. ఈ తక్కువ సమయంలోనే మీరు పాన్‌కార్డును పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి