BJP: ప్రజాహిత యాత్ర చేపట్టిన బీజేపీ నేత.. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు..

|

Feb 11, 2024 | 9:30 AM

కరీంనగర్‌ పార్లమెంట్‌లో దూకుడు పెంచారు ఎంపీ బండి సంజయ్. ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రెండంకెల ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన స్థానాలు సాధించి కార్యకర్తల్లో జోష్ నింపింది.

BJP: ప్రజాహిత యాత్ర చేపట్టిన బీజేపీ నేత.. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు..
Mp Bandi Sanjay
Follow us on

కరీంనగర్‌ పార్లమెంట్‌లో దూకుడు పెంచారు ఎంపీ బండి సంజయ్. ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రెండంకెల ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన స్థానాలు సాధించి కార్యకర్తల్లో జోష్ నింపింది. పైగా కామారెడ్డి లాంటి నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండులను ఓడించి తెలంగాణలో తనకు ఉనికి ఉందని నిరూపించుకుంది. అలాంటి క్రమంలోనే తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపి మెజార్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. ప్రస్తుతం నాలుగు ఎంపీలతో సరిపెట్టుకున్న కమలం పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని స్థానాలు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. బీజేపీకి గతంలో వన్ మ్యాన్ షోగా కీలక పాత్ర పోషించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే తనకు టికెట్ కన్ఫాం అని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా తన నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు.

ఈ యాత్రలో పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధులను ప్రజలకు వివరించారాయన. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత నియోజక వర్గ ప్రజలకు ఏం చేసారో.. ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు క్షుణ్ణంగా వివరించేందుకు యాత్ర చేపట్టారు. ఈనెల 10నుంచి 15వ తారీఖు వరకూ యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి దగ్గర తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు సంజయ్. తర్వాత కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మెడిపల్లి నుంచి ప్రజాహితను ప్రారంభించారు. తాను ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో సుమారు వందల కోట్ల నిధులు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసినట్లు మేడిపల్లిలో జరిగిన కర్నార్ మీటింగ్‌లో ప్రజలకు వివరించారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు తనను ఎంపీగా గెలిపిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పోరాడినట్లు చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తాను నియోజకవర్గానికి ఏం చేయలేదని ఆరోపిస్తున్న వారికి సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అంటూ విమర్శించారు. వినోద్‌ కరీంనగర్ స్థానికుడు కాదన్న బండి సంజయ్.. తనది పక్కా లోకల్ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..