Telangana: సాయి గణేష్ ఆత్మహత్య దుమారం.. CBI విచారణ కోరుతూ హైకోర్టులో BJP పిటిషన్

| Edited By: Ravi Kiran

Apr 22, 2022 | 7:07 PM

Telangana High Court: ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య దుమారం కొనసాగుతూనే ఉంది. కమలం వర్సెస్‌ గులాబీ పార్టీ మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది.

Telangana: సాయి గణేష్ ఆత్మహత్య దుమారం.. CBI విచారణ కోరుతూ హైకోర్టులో BJP పిటిషన్
Khammam BJP Worker Sai Ganesh
Follow us on

Sai Ganesh Incident: ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య దుమారం కొనసాగుతూనే ఉంది. కమలం వర్సెస్‌ గులాబీ పార్టీ మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. సాయి గణేష్‌ ఆత్మహత్యపై.. సీబీఐ విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపుల వల్లే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరపించాలని తెలంగాణ బీజేపీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రానికి చెందిన దర్యాప్తు సంస్థల దర్యాప్తుతో బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం లేదని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని చెబుతున్నారు.

మంత్రి వేధింపుల కారణంగానే తోనే సాయిగణేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని.. కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. సాయి గణేశ్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

సాయి గణేష్ మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. అతని కుటుంబాన్ని ఈ మధ్యాహ్నం పరామర్శించనున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఇప్పటికే కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సాయి కుటుంబాన్ని ఓదార్చారు. హోం మంత్రి అమిత్ షా.. స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఇదే అంశంపై రాష్ట్ర బీజేప నేతలు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విచారణ రెండు వారాలకు వాయిదా..

సాయు గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలు అయిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులిచ్చింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదాలను హైకోర్టు ఆదేశించింది. మంత్రి పువ్వాడతో పాటు ఖమ్మం టీఆర్ఎస్ నేత ప్రసన్నకృష్ణ, కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు, ఖమ్మం సీపీ, సీఐ సర్వయ్య, త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో, సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Also Read..

Corona Crisis: పుట్టినిల్లు చైనాని వణికిస్తోన్న కరోనా.. షాంఘైలో ఆహారపు కొరత.. మరోవైపు పెరుగుతున్న మానసిక ఆరోగ్య బాధితులు

Google CEO: సుందర్‌ పిచాయ్‌కు షాకిచ్చిన గూగుల్‌.. ఈ ఇండియన్ సీఈవోకే ఎందుకిలా..