Maheshwar Reddy: ‘రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని కాదు.. అధికారంలోకి రావాలనే హామీలు’: బీజేపీ ఎమ్మెల్యే..

|

Dec 16, 2023 | 1:34 PM

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తరువాత పలు అంశాలపై చర్చ ప్రారంభమైంది. సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 412 హామీలు ఇచ్చారు.. కానీ 6 గ్యారంటీల గురించే ప్రభుత్వం చెబుతోందని గుర్తు చేశారు.

Maheshwar Reddy: రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని కాదు.. అధికారంలోకి రావాలనే హామీలు: బీజేపీ ఎమ్మెల్యే..
Bjp Mla Maheshwar Reddy
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తరువాత పలు అంశాలపై చర్చ ప్రారంభమైంది. సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 412 హామీలు ఇచ్చారు.. కానీ 6 గ్యారంటీల గురించే ప్రభుత్వం చెబుతోందని గుర్తు చేశారు. ఈ సెషన్‌లోనే వాటిని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి రోజు నడిపిస్తామని చెప్పి. ఇప్పుడు వారానికి రెండు రోజులే ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని హామీలిచ్చినా.. అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్‌కి దగ్గరగానే ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అప్పులను సాకుగా చూపి హామీలను అమలు చేయకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే..దానికి విలువ ఉండదన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ హామీలు ఇవ్వలేదని కేవలం అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతోనే హామీలు ఇచ్చిందిని విమర్శించారు. ఇచ్చిన హామీలకు ఏ రకంగా నిధులు సమకూరుస్తారు? అని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర మరువలేనిదని.. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని సభలో చెప్పుకొచ్చారు. అప్పటి కేంద్రమంత్రి సుష్మస్వరాజ్‌ పాత్రను గుర్తు చేసుకోవాలన్నారు. సకల జనుల సమ్మెవల్ల తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా తెచ్చేందుకు..అంతా కలిసి ప్రయత్నిద్దాం అని సభ్యులను కోరారు. 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని.. మహిళలకు రూ.2500 ఎప్పుడిస్తారో చెప్పాలని నిలదీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..