AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: బీజేపీ భారీ ప్లాన్.. తెలంగాణలో ప్రధాని మోడీ, అమిత్ షా పర్యటన..! త్వరలోనే షెడ్యూల్‌

ఈ సారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాల్సిందే.. ఇదీ బీజేపీ టార్గెట్. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తెలంగాణపై మరింత ఫోకస్ పెంచుతోంది బీజేపీ.. ఈ మేరకు అస్త్రాలను సిద్ధం చేసి.. వ్యూహాలకు పదనుపెడుతోంది. దీనిలో భాగంగానే ఢిల్లీ నేతలు వరుస పర్యటనలు చేస్తూ.. రాజకీయాలు హీటెక్కిస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు కీలక నేతల పర్యటనలు ఫిక్స్ అయ్యాయి.

Telangana BJP: బీజేపీ భారీ ప్లాన్.. తెలంగాణలో ప్రధాని మోడీ, అమిత్ షా పర్యటన..! త్వరలోనే షెడ్యూల్‌
Amit Shah, PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2023 | 12:16 PM

Share

ఈ సారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాల్సిందే.. ఇదీ బీజేపీ టార్గెట్. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తెలంగాణపై మరింత ఫోకస్ పెంచుతోంది బీజేపీ.. ఈ మేరకు అస్త్రాలను సిద్ధం చేసి.. వ్యూహాలకు పదనుపెడుతోంది. దీనిలో భాగంగానే ఢిల్లీ నేతలు వరుస పర్యటనలు చేస్తూ.. రాజకీయాలు హీటెక్కిస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు కీలక నేతల పర్యటనలు ఫిక్స్ అయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రాక ముందే బీజేపీ జాతీయ నేతలు ఇలా రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయడాన్ని బట్టి చూస్తుంటే ఈ ఎన్నికను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న బీజేపీకి కర్నాటకలో ఎదురుదెబ్బ తగిలింది. ఉన్న ఒక్క రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. దీంతో తెలంగాణపై ప్రత్యక ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. ఎన్నికలకు గట్టిగా మూడు నెలలు కూడా టైమ్ లేదు. అందుకే బీజేపీ జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రంలో వరుసగా పర్యటనలు చేస్తూ.. కార్యకర్తల్లో నింపుతున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పలు కీలక కార్యక్రమాలు నిర్వహించింది. అమిత్‌షా ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ఈ క్రమంలోనే మరోసారి అమిత్ షా తో పాటు ప్రధాని మోదీ, నడ్డా కూడా తెలంగాణలో పర్యటించబోతుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

మహబూబ్‌నగర్‌, నిజామాబాద్, నల్గొండలో ప్రధాని నరేంద్ర మోదీ సభలు ఉంటాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మూడేసి సభల్లో పాల్గొంటారు. మొత్తంగా 9 భారీ బహిరంగసభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ బీజేపీ. అది కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పూర్తి చేయాలని కమల వ్యూహం. ఆ తర్వాత కొత్త జిల్లా కేంద్రాల వారీగానూ సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వీరందరి షెడ్యూల్స్ ఖరారు కానున్నాయి. షెడ్యూల్ ఖరారైన తర్వాత అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని సమాచారం.. ఈ మేరకు కేంద్ర మంత్రి, టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అధిష్టానం

మరోవైపు మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ఎంపీలకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈనెల 23న రాష్ట్రానికి చెందిన ఎంపీలకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. గన్ పార్క్ నుంచి నాంపల్లి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..