Telangana: పొలంలో ఉంగరం పోగొట్టుకున్న బీజేపీ లీడర్.. 24 గంటల్లోనే కనిపెట్టిన పోలీసులు.. కానీ

|

Dec 07, 2022 | 5:33 PM

ఆయనంటే పెద్ద సారు.. పైగా కేంద్ర సర్కారు మనిషి కాబట్టి ఉంగరం పోయిందనగానే.. అంత టెక్నాలజీ ఉపయోగించి.. అంత మందిని పంపారు. మరి సానమ్యాల పరిస్థితి ఏంటి..?

Telangana: పొలంలో ఉంగరం పోగొట్టుకున్న బీజేపీ లీడర్.. 24 గంటల్లోనే కనిపెట్టిన పోలీసులు.. కానీ
Bjp Leader Nvss Prabhakar
Follow us on

మీ చేతికున్న ఉంగరం పోయిందనుకోండి… మీరేం చేస్తారు.. మహా అయితే ఎక్కడ పడిపోయిందన్న అనుమానం వస్తే అక్కడ వెతుకుతారు. ఇంకా ఖరీదైనది అనిపిస్తే.. దగ్గర్లో ఉన్న పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. మరి అప్పుడు పోలీసులేం చేస్తారు… మీరు చెప్పిన మర్నాడే ఎక్కడ పోయిందో తెలుసుకొని, మెటల్ డిటెక్టర్లు పట్టుకొని… మీ వెనకే వచ్చేసి దాన్ని వెతికి పెట్టి ఇస్తారా..? అసలు ఇలా జరుగుతుందని మీరు కల్లో కూడా ఉహించగలరా…?. అయితే ఆ ప్లేస్‌లో మీరు కాకుండా ఓ విఐపీ ఉంటే.. అంతో ఇంతో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి ఉంగరం అయితే ఏం జరుగుతుంది..? పోలీసులు ఎలా స్పందిస్తారు…? అందుకే మీరు ఈ వార్తను కచ్చితంగా చూడాల్సిందే… ఈ ఉంగరం కథను చదివి తరించాల్సిందే.

పైన ఫోటోలో ఉన్న వ్యక్తి NVSS ప్రభాకర్… ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. టీవీ డిబేట్లు తరచుగా చూసే జనాలకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సినవసరం లేదు. నిన్నటికి నిన్న ఈయన తన పొలానికెళ్లారు. పొలంలో పనిచేసే వ్యక్తికి ఆరోగ్యం బాగులేకపోయేసరికి. అక్కడున్న ఆవులకు ఆయనే స్వయంగా గడ్డి కోసి వేశారు. సరిగ్గా అప్పుడే జరగకూడనిది జరిగిపోయింది. చేతికున్న ఉంగరం కాస్త జారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో… మేం చెప్పడం ఎందుకు ఆయన మాటల్లోనే విందాం.

అది సంగతి.. ఇలా రాచకొండ కమిషనర్‌కి చెప్పీ చెప్పగానే…. మర్నాడే ఓ నలుగురి టీంని పంపించి పొలంలో డాగ్ స్క్వాడ్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వెతికి పెట్టి రావు గారి ఉంగరాన్ని తిరిగి రావుగారికి అందించారు. శభాష్.. నిజంగా ఇది అద్భుతమే… అయితే ఇలాంటి అద్భుతాలు రావుగారి లాంటి వీఐపీలకే కాదు… సాధారణ పౌరుల జీవితాల్లో కూడా అప్పుడప్పుడైనా జరుగుతుంటే.. ఎవ్వరూ పెద్దగా ఆశ్చర్యపోరు. లేదంటేనే… ఇదుగో.. ఇలాగే పోలీసుల పని తీరు చూసి అవాక్కై ఆశ్చర్యపోయి.. నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. ఇది ప్రభాకర్‌ గారి ఉంగరం కథ. చేతికున్న ఉంగరం పొలంలో పడిపోయిందని ఇలా కంప్లైంట్ చెయ్యగానే.. రాచకొండ పోలీసులు ఆఘమేఘాల మీద స్పందించి.. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వెతికి పెట్టి ఉంగరాన్ని దొరకబుచ్చుకున్న సంగతి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి