Etela Rajender: కేసీఆర్ అబద్ధపు మాటలతో చలామణి అవుతూ మోసం చేస్తున్నారు.. బీజేపీ లీడర్ ఈటల ఫైర్..

|

Jan 19, 2023 | 9:44 PM

దేశంలో ఎవరు చెడ్డ సీఎం అంటే నంబర్ వన్ కేసీఆర్ అని సర్వేలు చెప్తున్నాయని బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు..

Etela Rajender: కేసీఆర్ అబద్ధపు మాటలతో చలామణి అవుతూ మోసం చేస్తున్నారు.. బీజేపీ లీడర్ ఈటల ఫైర్..
Etela Rajender, Mla
Follow us on

దేశంలో ఎవరు చెడ్డ సీఎం అంటే నంబర్ వన్ కేసీఆర్ అని సర్వేలు చెప్తున్నాయని బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇస్తామనడం తుగ్లక్ నిర్ణయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు అన్నం పెట్టలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి డబ్బులు లేవు కానీ.. డబ్బులున్నవారికి ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. ఏ హామీ ఇవ్వకుండా ప్రజల ప్రేమను పొంది విజయం సాధించిన వ్యక్తి ప్రధాని మోదీ అని.. తెలంగాణలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆక్షేపించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కేసీఆర్ అబద్ధపు మాటలతో చలామణి అవుతూ మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

24 గంటల కరెంటు ఒక బోగస్. ఎక్కడా ఇవ్వడం లేదు. అభివృద్ధి మీద చర్చకు సిద్దం. రెండు వందల రకాల పనులు చేసుకోవడానికి ఈజీఎస్ కింద అనుమతి ఉంది. కల్లాలు కట్టే ముందు ప్రభుత్వం ఎందుకు అనుమతి తీసుకోలేదు? పద్దతి పాటించకుండా విమర్శించడం కరెక్ట్ కాదు. గ్రామాల అభివృద్ధి కేంద్రం నిధులతో జరుగుతోంది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం 45 వేల కోట్ల రూపాయల లిక్కర్ తాగుతోంది. ఊర్లలో డ్రగ్స్ అలవాటు పెరిగిపోతోంది. వీటిని అరికట్టాల్సిన పోలీసులు టీఆర్ఎస్ బానిసలుగా మారారు.

– ఈటల రాజేందర్, బీజేపీ లీడర్

ఇవి కూడా చదవండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో అన్నింటిలో బీజేపీ అభ్యర్థులు సిద్దంగా ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ఇక పైసలు, మద్యం పని చేయవన్న ఆయన.. కేసీఆర్ ప్రజల విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం