BJP Graduates MLC: పట్టభద్రులపై కమలం కన్ను.. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ కోసం ఇప్పటి నుంచే కసరత్తు షురూ!

| Edited By: Balaraju Goud

Jan 05, 2024 | 8:19 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతుంది. పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసరత్తు మొదలు పెట్టింది. పెద్ద ఎత్తున ఓటర్ నమోదు చేయించేందుకు ప్లాన్ చేస్తోంది.

BJP Graduates MLC: పట్టభద్రులపై కమలం కన్ను.. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌ కోసం ఇప్పటి నుంచే కసరత్తు షురూ!
Bjp On Vote Enroll
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతుంది. పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవాలని కసరత్తు మొదలు పెట్టింది. పెద్ద ఎత్తున ఓటర్ నమోదు చేయించేందుకు ప్లాన్ చేస్తోంది. శాసన మండలి ఒకరికి మరొకరిని యాడ్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. దీంతో అయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి జూన్ 8లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఓట్ల నమోదుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గం లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే ఫ్రెష్ గా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందే..!

గతంలో ఉన్న ఓటర్ జాబితా పరిగణనంలోకి తీసుకోకుండా కొత్తగా ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవల్సిందే. ఈ నేపథ్యంలోనే మూడు జిల్లాల పరిధిలోని నియోజకవర్గంలో ఈసారి భారీ ఎత్తున ఓటర్ నమోదు జరిగే అవకాశం ఉంది. పోటీ చేయాలనుకునే ప్రధాన పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున ఓటర్ ఎన్‌రోల్ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఓటర్ నమోదుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కమలం పార్టీ కూడా ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈసారి భారీ స్థాయిలో ఓటర్ నమోదు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పని కూడా ప్రారంభించింది. ఫామ్ 18 ఎక్కువ సంఖ్యలో ప్రింట్ చేయించి, పోలింగ్ బూత్ స్థాయి వరకు పంపించాలని డిసైడ్ అయింది. ప్రత్యేక టీమ్ లని పెట్టాలని అనుకుంటుంది.

గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు చేయకుండా పకడ్బందీగా కార్యచరణ రూపొందిస్తోంది భారతీయ జనతా పార్టీ. తమకు పట్టు లేదని అంటున్న ఆ జిల్లాలలో తమకు పట్టు ఉందని నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల వేడిలో ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తమకి అడ్వాంటేజ్ అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఆ సీటుకు కూడా పార్టీ లో పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఆ సీట్ పై కన్నేశారు. తనకి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కోరారట. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, పార్టీతో ఉన్న విద్యా సంస్థల అధినేతలు కూడా ఎమ్మెల్సీ బరిలోకి దిగేందుకు ఫ్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. చూడాలి మరీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…