Jubilee Hills Rape Case: పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్న మైనర్‌ రేప్‌ కేసు.. పోలీసుల తీరుపై బీజేపీ ఆగ్రహం..

|

Jun 03, 2022 | 6:38 PM

Hyderabad Rape Case: కేసును తప్పుదోవపట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలికను కారులో రెండుగంటలపాటు తిప్పుతూ లైంగికదాడికి పాల్పడిన మృగాలను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీస్తున్నారు. బాధితురాలికి న్యాయం..

Jubilee Hills Rape Case: పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్న మైనర్‌ రేప్‌ కేసు.. పోలీసుల తీరుపై బీజేపీ ఆగ్రహం..
Bjp Dharna
Follow us on

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో(Jubilee Hills) మైనర్‌ రేప్‌ కేసు పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. కేసు విచారణలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కేసును తప్పుదోవపట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలికను కారులో రెండుగంటలపాటు తిప్పుతూ లైంగికదాడికి పాల్పడిన మృగాలను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో మైనర్‌ రేప్‌ కేసు పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. కేసు విచారణలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కేసును తప్పుదోవపట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ముట్టడికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాలికను కారులో రెండుగంటలపాటు తిప్పుతూ లైంగికదాడికి పాల్పడిన మృగాలను ఎందుకు పట్టుకోవడం లేదని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో రాజకీయనేతల కొడుకులు, మనువళ్లు ఉన్నందునే కేసును నీరుగారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. కారు దొరికినా.. కారు నంబరు ఉన్నా.. నిందితులను పట్టుకోకపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. మైనర్‌ బాలికపై లైంగికదాడి ఘటనపై డీజీపీకి సూటి ప్రశ్నలు సంధించారు బీజేపీ నేతలు.

బాలికపై అఘాయిత్యం కేసులో షీటీమ్స్‌ ఏమయ్యాయని ప్రశ్నించారు ఎమ్మెల్యే రఘునందన్‌. హోంమంత్రి మనవడి పెళ్లి సందర్భంగా పబ్‌లో బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చినట్లు తెలిపారు. హోంమంత్రి పీఏ స్వయంగా పబ్‌ ముందు నిల్చున్నట్లు చెప్పారు. కేసులో నిందితుల పేర్ల స్థానంలో కారునంబర్‌ ఉండడమేంటని నిలదీశారు. మే 28న లైంగికదాడి జరిగితే మే 31దాకా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మైనర్‌రేప్‌ ఘటనలో నిందితులను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఈ కేసులో రాజకీయపార్టీల నేతలు ఉన్నందునే కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అందుకు ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే నిదర్శనమన్నారు.