CBI విచారణ జరిపించండి.. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సాయి గణేష్ అమ్మమ్మ ఫిర్యాదు..

|

Apr 19, 2022 | 7:41 PM

ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం అలజడి సృష్టిస్తోంది. తాజాగా సాయి గణేష్ అమ్మమ్మ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. మంత్రి పువ్వాడ అజయ్ చర్యలు తీసుకోవాలని లేఖలో..

CBI విచారణ జరిపించండి.. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సాయి గణేష్ అమ్మమ్మ ఫిర్యాదు..
Khammam BJP Worker Sai Ganesh
Follow us on

ఖమ్మం జిల్లాలో బీజేపీ(BJP) కార్యకర్త సాయి గణేష్(Sai Ganesh) ఆత్మహత్య వ్యవహారం అలజడి సృష్టిస్తోంది. తాజాగా సాయి గణేష్ అమ్మమ్మ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. మంత్రి పువ్వాడ అజయ్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మంత్రి అజయ్‌తోపాటు స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ ఒత్తిడితోనే పోలీసులు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తన కొడుకుది ఆత్మహత్య కాదని ఇది ఖచ్చితంగా హత్యే అంటూ వెల్లడించారు. మంత్రి ప్రోద్బలంతో పోలీసు అధికారులు తనపై 16 కేసులతోపాటు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారని, ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయిగణేష్ అమ్మమ్మ లేఖలో పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే.. సాయి గణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్ కాగా, తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ నాయకులు, పోలీసు అధికారి వేధింపులు భరించలేక ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబసభ్యులతో కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ మాట్లాడారు. సాయిగణేష్ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఖమ్మంలో ఆత్మహత్యకు చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేశ్‌ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. సాయి గణేశ్‌ కుటుంబం ధైర్యంగా ఉండాలని సూచించారు అమిత్‌షా. సాయిగణేశ్‌ మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. సాయిగణేశ్‌ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని అమిత్‌షా భరోసా ఇచ్చినట్టు తెలిపారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి. సాయిగణేశ్‌ మృతిపై సీబీఐ దర్యాప్తుకు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతానని అమిత్‌షా హామీ ఇచ్చారని తెలిపారు.

అసలు ఆరోజు ఏం జరిగిందంటే..

మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే స్టేషన్‌లో పురుగు మందు తాగడంతో.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులుప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మాట్లాడిన సాయి గణేష్.. తాను ఆత్మహత్య యత్నం చేయడానికి కారణాలను వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతోనే పురుగుల మందు తాగినట్టు సాయిగణేష్ చెప్పాడు. మంత్రి ఆగడాలు ఎక్కవయ్యాయని.. పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తనను టార్చర్ పెట్టాడని వాపోయాడు. ఆ టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశానన్నాడు. కాగా, ఆ తర్వాత, సాయి గణేష్ పరిస్థితి విషమంగా మారడంతో బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి: JC Prabhakar Reddy: చిన్నారి మృతితో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన జేసి

భారతసైన్యంలో ఇంటిదొంగలు.. వాట్సాప్‌ సందేశాలతో చైనా,పాక్‌కు సమాచారం చేరవేస్తునట్టు గుర్తింపు