Bird Flu : బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..! వేల కోళ్లు మృత్యువాత..

ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం బయటికి రావటంతో.. పౌల్ట్రీ యజమానులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు.. ఇప్పుడిప్పుడే చికెన్ తింటున్న ప్రజలు.. భయాందోళనలకు గురవుతున్నారు.

Bird Flu : బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..! వేల కోళ్లు మృత్యువాత..
Bird Flu Case

Updated on: Apr 03, 2025 | 1:47 PM

బాబోయ్‌.. బర్డ్‌ ఫ్లూ ఎక్కడో దూరంగా ఉందిలే అనుకున్నాం.. హైదరాబాద్‌ నగరానికి వైరస్‌ ముప్పు లేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. ఆ మధ్యలో కాస్త చికెన్‌కు దూరంగా ఉన్నవారంతా ఇప్పుడిప్పుడే.. లాగించేస్తున్నారు.. ఈ లోగానే కోడి కూతపెట్టినట్టుగా నేనున్నానని.. ఎటు పోలేదన్నట్టుగా బర్డ్‌ఫ్లూ చాపకింద నీరుల సైలెంట్‌గా రెక్కలు విధిలిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ సోకి ప్రాణాలు వదిలిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఘటన వెలుగులోకి వచ్చిన గంటల సమయంలోనే.. భాగ్యనగరంలో బాంబ్‌ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది.బర్ద్‌ఫ్లూ వైరస్‌ ఎక్కడికీ పోలేదని.. మెల్లిగా హైదరాబాద్‌ చేరుకుందని అధికారులు షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించారు.

అవును హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్‌ పరిధిలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫార్మ్‌లో నాలుగు రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో.. కోళ్ల శాంపిల్స్ సేకరించిన అధికారులు.. ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం బయటికి రావటంతో.. పౌల్ట్రీ యజమానులంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు.. ఇప్పుడిప్పుడే చికెన్ తింటున్న ప్రజలు.. భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే, సాధారణంగా బర్డ్‌ఫ్లూ వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశించవని చెబుతున్నారు. కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయని చెబుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..