Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Rain Alert: మూడు రోజులుగా కురుస్తున్న వానలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షపాతంతో ఊళ్లన్నీ ఏరులవుతున్నాయి.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు..
Rains

Updated on: Sep 11, 2022 | 5:59 AM

Rain Alert: మూడు రోజులుగా కురుస్తున్న వానలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షపాతంతో ఊళ్లన్నీ ఏరులవుతున్నాయి. ముందు ముందు భారీ వర్షాలుంటాయన్న హెచ్చరికలు తెలుగురాష్ట్రాలను వణికిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణను ఓ వైపు వాన ముప్పు.. మరోవైపు వరద గండం వెంటాడుతూనే ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద జోరు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమలాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాన దెబ్బకు కాకినాడ జిల్లా కకావికలమైంది.

ఏలూరు జిల్లా కుక్కునూరును భారీవర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేని వానతో గుండేటివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయలసీమలోనూ వానలు దంచికొడుతున్నాయి. అనంతపురం జిల్లాలో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. పీఏబీఆర్ జలాశయంలోకి భారీగా వరద నీరు రావడంతో ఉరవకొండ మండలం మైలారంపల్లి గ్రామంలోకి వరద నీరు చుట్టుముట్టింది. ఏపీపై రుతుపవన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

ఇవి కూడా చదవండి

ఇటు తెలంగాణలోనూ సేమ్ పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వాన, వరద ముంచెత్తుతోంది. 8 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్‌ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడే వెహికిల్స్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. అయితే భారీ వర్షాలుంటాయన్న వార్నింగ్స్‌ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..