Fire Accident: భువనగిరి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని కీలలు..

Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భువనగిరి పారిశ్రామిక వాడలోని పరుపుల కంపెనీలో..

Fire Accident: భువనగిరి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని కీలలు..
Follow us

|

Updated on: Feb 14, 2021 | 9:40 PM

Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భువనగిరి పారిశ్రామిక వాడలోని పరుపుల కంపెనీలో మంటలు చెలరేగాయి. పరుపులకు నిప్పురవ్వలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కంపెనీలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Dancing Queen : 100వ పుట్టిన రోజు జరుపుకున్న బామ్మ .. డ్యాన్స్‌తో అదరగొట్టిన వృద్ధురాలు, నెటిజన్లు ఫిదా

Alert For Slack Users: మీ మొబైల్‌లో ‘స్లాక్‘ యాప్ ఉందా..? అయితే వెంటనే ఈ పనిచేయండి..