MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటంః ఎమ్మెల్సీ కవిత

| Edited By: Balaraju Goud

Nov 05, 2023 | 5:34 PM

మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ లో ఉన్నపిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని ఆ సంస్థ అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటంః ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha
Follow us on

మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ లో ఉన్నపిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని ఆ సంస్థ అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో కేంద్రం సెప్టెంబర్‌ 19న లోక్‌సభలో, సెప్టెంబరు 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే జనగణన, డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి రానుంది.

అయితే, మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణ అమలు కోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు, సంస్థలు కోర్టుకు వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో భారత్ జాగృతి తరపున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామన్నారు కవిత. న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో తాము ఇంప్లీడ్ అవుతామని కవిత ప్రకటించారు.

ఇదిలావుంటే, మహిళా రిజర్వేషన్ల అంశం మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోలేదు. అనేకమంది ప్రధానులు యత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..