బేగంపేటలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. పోలీసులు ఆపి చెక్‌ చేయగా..

బేగంపేటలో ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాల్గొన్న వ్యాపారవేత్త కరణ్ పరమార్‌ను అరెస్ట్ చేశారు. అతని నుండి 19.36 గ్రాముల కోకెయిన్, 6.77 గ్రాముల ఎంజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుండి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

బేగంపేటలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. పోలీసులు ఆపి చెక్‌ చేయగా..
Begumpet Police

Edited By:

Updated on: May 28, 2025 | 12:30 PM

సిటీలో మరోసారి డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి. బేగంపేట వద్ద డ్రగ్స్ తరలిస్తున్న కరన్ పరమార్ అనే వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు వ్యాపారవేత్త అని తెలిసింది. అతడి వద్ద నుండి 19.36 గ్రాముల కొకైన్, 6.77 గ్రాముల ఎంజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. గోవాకు చెందిన సంతోష్ జాదవ్ నుంచి ఈ డ్రగ్స్ కొరియర్ ద్వారా తెప్పించి నగరంలో సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నిందితుడు గతంలో కూడా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో పాల్గొన్నట్లు సమాచారం. కరణ్ నుంచి గతంలో డ్రగ్స్ కొనుగోలు చేసిన ఇతర వ్యక్తులను ట్రాక్ చేసేందుకు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు ద్వారా డ్రగ్స్ వ్యాపారం యువతను లక్ష్యంగా చేసుకుంటూ, నగరాలలో ఎలా విస్తరిస్తుందో స్పష్టమవుతోంది. డ్రగ్స్ విక్రయానికి సంబంధించి, కొన్ని ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మిగతా సంబంధిత వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి