Beautician Suicide: హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భర్తతో కొన్ని రోజులుగా విభేదాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ బ్యూటీషియన్ ఆత్మహత్య చేసుకుంది. అర్ధారాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపిన ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఆన్‌మిట్ లేప్చా (39) భర్తకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లోని అలియన్స్ బ్లెండ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.
అయితే.. విరద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆన్‌మిట్ లేప్చా ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్లుగా హఫీజ్‌పేట్‌లో విడిగా నివాసముంటోంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మళ్లీ గొవడలు మొదలైనట్లు పేర్కొంటున్నారు. అయితే.. శుక్రవారం అర్ధరాత్రి గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే గమనించిన ఆమె స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆమె స్నేహితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Also Read: