Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..

|

Jul 20, 2021 | 12:04 PM

Exams: తెలంగాణలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు.

Exams: ఈనెల 25న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష.. హెచ్‌సీయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీల్లో మార్పు..
Exams
Follow us on

Exams: తెలంగాణలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 25వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు సైతం కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సంబంధిత హాల్‌టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ mjptbcwreis.telangana.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. ఏవైనా సందేహాలుంటే 040-23328266 నెంబరును సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్ష తేదీల్లో మార్పు..
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు హెచ్‌సీయూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా, వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 46 పీజీ కోర్సులతో కలిపి మొత్తం 116 కోర్సు్ల్లో 2328 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు్ల్లో ప్రవేశాలకు ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తూ హెచ్‌సీయూ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Also read:

Hyderabad: చిన్నారిపై తాత లైంగిక దాడి!.. రిపోర్ట్‌లో మాత్రం రివర్స్.. అసలు కారణం అదేనా?

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి మరీ..

Tirumala: తిరుమల భక్తులకు బ్రేకింగ్ న్యూస్.. ఆగస్టు కోటాకు సంబంధించి రూ. 300 దర్శన టికెట్లు విడుదల..