Bathukamma Sarees: ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. నేటి నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ

| Edited By: Ravi Kiran

Oct 02, 2021 | 8:18 AM

Bathukamma Festival 2021: రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ ప్రారంభం కానుంది. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా

Bathukamma Sarees: ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. నేటి నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ
Batukamma Sarees
Follow us on

Bathukamma Festival 2021: రాష్ట్ర వ్యాప్తంగా నేటినుంచి బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ ప్రారంభం కానుంది. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండగ సందర్భంగా ఏటా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చీరల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే చీరలు జిల్లాలకు చేరాయి. అక్కడి నుంచి గ్రామాల వారిగా అధికారులు సరఫరా చేశారు. ఈ నెల 6వ తేదీ వ‌ర‌కు బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేశారు.

18 ఏళ్లు పైబ‌డి రేష‌న్ కార్డులో పేరు న‌మోదైన వారికి చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఈ ఏడాది 810 ర‌కాల చీర‌ల‌ను, 1.08 కోట్ల మ‌హిళ‌ల‌కు పంపిణీ చేయ‌నున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. బ‌తుక‌మ్మ చీర‌ల కోసం ప్రభుత్వం రూ.333.14 కోట్లు ఖ‌ర్చు చేసింది. అయితే.. ఈ సారి సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారుచేయించారు. గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ సారి సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 290 వర్ణాలలో సరికొత్తగా రూపొందించారు.

డాబీ అంచు చీరలు ఈ సారి బతుకమ్మ పండుగకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. అటు, చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Also Read:

Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..

AP CM Jagan: నేడు సొంత ఊరుకు సీఎం జగన్ పయనం.. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన