Bandi Sanjay: కొండగట్టుకు వెళ్లి భూములు కొన్నారు.. సీఎం టూర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొండగట్టు పర్యటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొండగట్టుకు వెళ్లి భూములు కొన్నారని విమర్శించారు. కేసీఆర్..

Bandi Sanjay: కొండగట్టుకు వెళ్లి భూములు కొన్నారు.. సీఎం టూర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 16, 2023 | 7:36 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొండగట్టు పర్యటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొండగట్టుకు వెళ్లి భూములు కొన్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కొండగట్టు వెళ్తే పూజలు చేయడం కోసం అనుకున్నానన్న బండి సంజయ్.. భూములు కొని అభివృద్ధి అంటున్నారని మండిపడ్డారు. కొండగట్టు కు 1000 కోట్లు అన్న ముఖ్యమంత్రి మాటను ఎవరూ నమ్మరని ఆక్షేపించారు. కొండగట్టు చుట్టుపక్కల భూములన్నీ త్వరలోనే ఖతం అవుతాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఫాంహౌస్ లో ఎక్కడ చూసినా నిమ్మకాయలే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఫాంహౌస్ కు వెళ్లాలంటే భయపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంమంత్రి కేసీఆర్.. కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. కొండగట్టుకు అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు ఇవ్వగా.. మరో రూ.500 కోట్లు ప్రకటించడంతో మొత్తం రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కొండగట్టు బృహత్తర ప్రాజెక్ట్ లో భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే.. కొండగట్టు అనే పేరు రావాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..
బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..