Bandi Sanjay fire on Government : సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వేరోస్ సంస్థ సృష్టిస్తున్న ఆగడాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే హిందు మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నిచారు. సంస్థ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. లేదంటే కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడినుంచి తీయించమంటారా అని నిలదీశారు.
హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వసఏమి చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన.. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటి సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 16, 2021