Bakrid 2021: బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. మత పెద్దలతో సీపీ అంజనీ కుమార్..

|

Jul 12, 2021 | 10:46 PM

Bakrid 2021: త్యాగాలకు ప్రతీకైన బక్రీద్​పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీస్​కమిషనర్​అంజనీకుమార్​ విజ్ఞప్తి చేశారు.

Bakrid 2021: బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. మత పెద్దలతో సీపీ అంజనీ కుమార్..
Cp Anjani Kumar
Follow us on

Bakrid 2021: త్యాగాలకు ప్రతీకైన బక్రీద్​పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నగర పోలీస్​ కమిషనర్​అంజనీకుమార్​ విజ్ఞప్తి చేశారు. బక్రీద్​ పండుగను పురస్కరించుకుని పాతబస్తీ సాలార్​జంగ్ ​మ్యూజియంలో జరిగిన సమావేశానికి పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అల్లా ఆదేశాలపై ఇబ్రహీం అలే సలాం తమ కుమారుని ఖుర్భాని ఇవ్వడానికి సిద్దమయ్యాడని, మనం కుల మతాలకు అతీతంగా దురలవాట్లకు దూరంగా ఉండాలని సీపీ పేర్కొన్నారు. ఇస్లాంలో అనారోగ్యంగా ఉన్న జంతువుల ఖుర్భానికి అనుమతి లేదని, అలాంటి జంతువుల మాంసం తినేవారు కూడా అనారోగ్యాల భారిన పడుతారని ప్రతీతి అన్నారు. వ్యాపారులు కూడా నిషేధించిన జంతువులను కొనుగోలు చేయవద్దన్నారు.

జంతువులతో వస్తున్న వాహనాలను పోలీసులే తనిఖీలు చేస్తారని, నిబంధనలకు విరుద్దంగా ఉన్న జంతువులను స్వాధీనం చేసుకుంటారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులకు తప్ప వాహనాలను ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. కొందరు కావాలనే ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారని సీపీ అన్నారు. అలాంటి వారి ప్రయత్నాలను కలిసికట్టుగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బక్రీద్ ​పండుగ సందర్భంగా పాతబస్తీలో మూడు రోజుల పాటు ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసి అధికారులు జంతువుల వ్యర్థాలను తొలగిస్తారని చెప్పారు. ఖుర్భాని ఇచ్చే వారికి ప్లాస్టిక్​ కవర్​లు కూడా అందజేస్తున్నారన్నారు.

యాకత్‌పురా ఎమ్మెల్యే పాషాఖాద్రి, వక్ఫ్​బోర్డ్​ చైర్మన్​ సలీంలు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ సరిహద్దుల్లో కొందరు వాహనాలను ఆపి తప్పుదోవ పట్టిస్తున్నారని, నిబంధనలను పాటిస్తూ తెచ్చుకున్న జంతువులను అనుమతించాలని వారు ఈ సందర్భంగా కోరారు. పండుగ రోజు నగరంలోని స్లాటర్​హౌజ్‌లు తెరిచి ఉంటాయని, ప్రజలు తమ జంతువులను స్లాటర్ హౌజ్‌ల వద్దకు తీసుకువచ్చి కట్ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రియాజుల్ హసన్, జోనల్ కమిషనర్ అశోక్​ సామ్రాట్, పోలీసు ఉన్నతాధికారులు డిఎస్​చౌహాన్, షికా గోయల్, అనిల్ కుమార్, సౌత్​జోన్​డిసిపి గజరావు భూపాల్ తో పాటు ముస్లిం మత పెద్దలు ముర్తూజా పాషా, జాఫర్​ పాషా, హాబేజ్ ముజఫర్, సయీద్​ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

Also read:

Viral Video: ఇలాంటి ఆక్టోపస్‌ని మీరెప్పుడూ చూసి ఉండరు..! వైరలవుతోన్న వీడియో

Model Murder: ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇంటికెళ్లిన సోదరుడు.. నగ్నంగా రక్తపు మడుగులో ప్రముఖ మోడల్..!

Kitex Garments: కైటెక్స్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి ట్వీట్.. తీవ్రంగా స్పందించిన టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్..