Badminton Player: తండ్రి పొలిటికల్ ఎంట్రీ.. దేశం కోసం-ధర్మం కోసం అవసరం ఉందంటూ..

Shiv Sena Telangana: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కశ్యప్‌ తండ్రి పారుపల్లి ఉదయ్‌ శంకర్ శివసేన పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శివసేన పార్టీ తెలగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ. మహారాష్ట్ర సీఎం షిండేకి సంబంధించిన తెలంగాణలోని శివసేనలో చేరిన..

Badminton Player: తండ్రి పొలిటికల్ ఎంట్రీ.. దేశం కోసం-ధర్మం కోసం అవసరం ఉందంటూ..
Saina Nehwal and Parupalli Kashyap's Family

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 08, 2023 | 6:05 PM

Shiv Sena Telangana: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కశ్యప్‌ తండ్రి పారుపల్లి ఉదయ్‌ శంకర్ శివసేన పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శివసేన పార్టీ తెలగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ. మహారాష్ట్ర సీఎం షిండేకి సంబంధించిన తెలంగాణలోని శివసేనలో చేరిన పారుపల్లి ఉదయ్‌ శంకర్ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌‌కి స్వయానా మామ. అయితే రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా ప్రజాసేవ చేసేందుకు శివసేన పార్టీలో చెరినట్టు ఆయన తెలిపారు. త్వరలో ఎంతో మంది శివసేన పార్టీలో చెరనున్నట్టు ఉదయ్‌ శంకర్ తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాడే వారు శివసేన పార్టీలో చేరాల్సిన అవసరం ఉందని ఉదయ్‌ శంకర్ అన్నారు.

శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శివసేన పార్టీ బలమైన శక్తిగా చెయ్యడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజలు పడుతున్న కష్టాలపై పోరాటం చేస్తామని.. రోజురోజుకు రాష్ట్రంలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని..విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు శివసేన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు శివాజీ అన్నారు. రానున్న రోజులలో శివసేన పార్టీ బలోపేతం చేస్తామని, భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. ఇంకా 119 స్థానాలలో శివసేన పార్టీ అభ్యర్థులు ఉంటారని స్పష్టం చేసారు. పారుపల్లి ఉదయ్‌ శంకర్‌తో పాటు నెక్సస్ డ్రగ్స్ ప్రవెట్ లిమిటెడ్ ఫార్మ కంపెనీకి చెందిన టెక్నికల్ డైరెక్టర్‌ రాజరావు కూడా శివ సేన పార్టీలో చేరారు. త్వరలో వందల సంఖ్యలో వివిద విభాగాలకు చెందిన వారు పార్టీలో చేరనున్నట్టు ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఎల్లెందర్ రెడ్డి, టీవీ9 రిపోర్టర్, హైదరాబాద్

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.