Badangpet Mayor Resign: టీఆర్‌ఎస్‌కు షాక్‌.. మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా

Badangpet Mayor Resign: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీకి షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పత్రిక ..

Badangpet Mayor Resign: టీఆర్‌ఎస్‌కు షాక్‌.. మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా

Updated on: Jul 03, 2022 | 12:42 PM

Badangpet Mayor Resign: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీకి షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈరోజు రాజీనామా లేఖను పంపినట్లు, పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బడంగ్ పేట అభివృద్ధి కాంక్షించి పార్టీ లో చేరడం జరిగిందని, అప్పటి నుండి నేటి వరకు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని అన్నారు.

క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతోనే మేము సేవలందించామని.. కానీ గడిచిన కొంతకాలంగా మా పట్ల వ్యతిరేక భావనతో ఉండడంతోనే, మేము మా ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. పార్టీలో మా ఉన్నతిని ఓర్వలేక, మాకు ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆదరాభిమానాలను జీర్ణించుకోలేక, రాజకీయంగా చేస్తున్న కక్ష సాధింపును ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి