అయ్యో.. ఇంతదానికే.. అంత కఠిన నిర్ణయమా..? తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..!

జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ అక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. స్నేహితురాళ్లు అవమానించారని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో చోటుచేసుకుంది.

అయ్యో.. ఇంతదానికే.. అంత కఠిన నిర్ణయమా..? తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..!
B.tech Student Commits Suicide

Edited By: Balaraju Goud

Updated on: Jul 06, 2025 | 9:00 AM

స్నేహితురాళ్లు అవమానించారని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ అక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.

ఇటీవల నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ స్నేహితురాళ్లు అవమానించారు. దీంతో ఇంటికి చేరిన నిత్య జూలై 2వ తేదీన గడ్డి మందు తాగింది. దీంతో ఆపస్మారకస్థితికి చేరిన ఆమెను కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ.. శనివారం(జూలై 05) రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్సై సుధాకర్ తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంగారు భవిష్యత్ ఉన్న అమ్మాయి చనిపోవడంతో తల్లిదండ్రులు జీర్ణిచుకోలేకపోతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..