KCR Cricket Trophy final match: వేలాది మంది క్రీడాభిమానులతో సిద్ధిపేట స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా మంత్రి హరీష్ రావు నేతృత్వంలో క్రికెట్ ట్రోఫీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా బుధవారం క్రీడాకారుల కోలాహలం మధ్య ఫైనల్ మ్యాచ్ సందడిగా సాగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కాసేపు క్రికెట్ ఆడి అజారుద్దీన్, హరీశ్‌రావు సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫైనల్ సందర్భంగా మ్యాచ్‌ను చూసేందుకు క్రీడాభిమానులు భారీగా తరలిరావడంతో సిద్ధిపేట నగరం కిక్కిరిసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతలకు అజారుద్దీన్, హరీశ్ రావు బహుమతులు అందించనున్నారు. అయితే క్రిడాకారులను ఎంకరేజ్ చేసేందుకు సిక్స్ కొట్టు.. తౌజండ్ పట్టు అనే కాన్సెప్ట్‌తో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
Also Read: