హైదరాబాద్, జనవరి 22: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కన్నుల పండువగా తిలకించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు తమ భక్తిని ఒక్కో రకంగా ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ సాంకేతికంగా, సాంస్కృతికంగా అభివృద్ది చెందిన నేపథ్యంలో మరో సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది. సుధా కార్స్ మ్యూజియం అనే సంస్థ కారుపై అయోధ్య రెప్లికాను రూపొందించింది. దీని యాజమాని సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరం తరహాలో మాస్టర్ పీస్ రూపొందించినట్లు తెలిపారు. ఈ నమూనాను 10 మంది ముస్లీం కార్మికులతో కలిసి మొత్తం 21 మంది వ్యక్తులు దీనిని తయారీలో భాగస్వామ్యమైనట్లు తెలిపారు. అనుకున్న సమయానికి దీనిని తయారు చేసినందుకు కార్మికులను అభినందించారు. ఈ నమూనా కారును జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ అయిపోయిన తరువాత ఎక్కడకి తీసుకెళ్లాల్సిన దానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే నాగభూషణ్ రెడ్డి అనే మరొక రామ భక్తుడు 1265 కిలోల లడ్డూను అయోధ్య బాల రామునికి నైవేద్యంగా సమర్పించారు. ఈ లడ్డూను అయోధ్యకు రవాణా చేసేందుక ప్రత్యేకమైన రిఫ్రిజిరేటర్ ను తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ లడ్డూను దాదాపు 30 మంది సిబ్బంది శ్రమించినట్లు తెలిపారు. 1256 కిలోల లడ్డూను బహుకరించేందుకు గల ప్రధాన కారణం కూడా చెప్పుకొచ్చారు. రామ జన్మభూమి శంకుస్థాపన చేసిన తొలి రోజు నుంచి రోజు కిలో లడ్డూ నైవేద్యం ఇవ్వాలనుకున్నట్లు సంకల్పించారు. అందులో భాగంగానే ఆలయ నిర్మాణానికి 1256 రోజులు అయినందున అన్ని కేజీల లడ్డూను అయోధ్య బాల రామునికి సమర్పించినట్లు తెలిపారు.
#WATCH | Telangana | In a unique blend of technology and art, Hyderabad-based Sudha Car Museum has crafted a mobile masterpiece – a model of the Ayodhya Ram Mandir mounted on a car. pic.twitter.com/TMRF2BSxiM
— ANI (@ANI) January 17, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..