AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: అరె.. రామన్న ఏంటి ఇలా మారిపోయిండు.. నెట్టింట వైరల్

ఈ ఫొటోలో కేటీఆర్ ఓ మాస్ హీరోలా కనిపిస్తుండటంతో.. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ కొత్త గెటప్‌లో ఉన్న ఫొటోను కేటీఆరే స్వయంగా ట్వీట్‌ చేయటం గమనార్హం. ఇంతకీ ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పదండి...

KTR: అరె.. రామన్న ఏంటి ఇలా మారిపోయిండు.. నెట్టింట వైరల్
KTR New Look
Ram Naramaneni
|

Updated on: Jan 22, 2024 | 4:56 PM

Share

తెలంగాణ, జనవరి 22: బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌ను గడ్డంతో, పెరిగిన జుట్టుతో ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు. ఆయన ఎప్పుడూ క్లీన్ షేవ్‌వో క్లాస్‌గా కనిపిస్తారు.  తాజాగా ఆయన లాంగ్ హెయిర్, ఒత్తైన గడ్డంతో ఉన్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఆయన ఊర మాస్ హీరోలా ఉన్నారు. ఈ ఫోటోను కేటీఆరే షేర్ చేశారు. అయితే ఇది ఒరిజినల్ గడ్డం, జుట్టు కాదండోయ్. ఓ అభిమాని ఎడిట్ చేసి కేటీఆర్‌కు పంపించారట. ఆ ఫోటో నచ్చడంతో ట్విట్టర్‌లో షేర్ చేశారు కేటీఆర్. “ది కమ్‌ బ్యాక్‌ ఈజ్‌ ఆల్వేస్‌ స్ట్రాంగర్‌ దేన్‌ ది సెట్‌ బ్యాక్‌” అనే కొటేషన్‌ను రాసుకొచ్చారు. దీంతో ఓ రేంజ్‌లో రియాక్షన్స్ వస్తున్నాయ్. “మా రామన్న రియల్ హీరో.. రీల్ హీరోలు పనికిరారు” అంటూ  కొందరు పార్టీ కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ ఫొటోపై “పింక్ ఆంట్స్ టీం USA” అన్న లోగో కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఈ ఫొటోను ఎడిట్ చేసిన ఆ అభిమాని ఎన్నారై అని కొందరు అంటున్నారు.

ఈ మధ్యే ఫేస్ యాప్ బాగా ఫేమస్ అయ్యింది కదా.. వెంటనే కేటీఆర్ ఫోటోతో ఓ అభిమాని ఈ  ప్రయోగం చేశాడన్నమాట. మీసం, గడ్డంతో ఆయన లుక్ మొత్తం మార్చేశాడు. కేటీఆర్ ఓ సమావేశంలో ప్రసంగిస్తున్న ఫోటోకు మార్పులు చేశాడు. కేటీఆర్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది నిజంగానే ఆయన కొత్త లుక్ అనుకొని పొరపాటు పడుతున్నారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?