Hyderabad: చార్మినార్ వద్ద ప్యాసింజర్ల కోసం లొల్లి.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటో డ్రైవర్లు..

| Edited By: Velpula Bharath Rao

Nov 18, 2024 | 2:17 PM

చార్మినార్ వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్లు నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. అప్పటికే వాళ్లు పెద్ద మోతాదులో గంజాయి సేవించారో ఏమో.. ఆ మత్తులో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన అక్కడ రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు, పాదచారులకు భయాందోళన పుట్టించింది.

Hyderabad: చార్మినార్ వద్ద ప్యాసింజర్ల కోసం లొల్లి.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఆటో డ్రైవర్లు..
Auto Drivers Fight Near By Hyderabad Charminar
Follow us on

చార్మినార్.. ఈ పేరు చెప్పగానే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అపురూపమైన కట్టడం గుర్తుకొస్తుంది. దేశానికే తలమానికంగా నిలిచి హైదరాబాద్ నగరానికి కేంద్ర బిందువులా మారిన చార్మినార్ పేరుకు మచ్చ తీసుకువచ్చే కొన్ని సంఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. ఇద్దరు యువకులు గంజాయి మత్తులో నడిరోడ్డుపైనే కొట్టుకోవడం మొదలెట్టారు. ఆటో పార్కింగ్, ప్యాసింజర్ల విషయంలో మాటామాటా పెరిగి వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చార్మినార్ ప్రాంతంలో రోజూ లక్షలాది మంది పర్యాటకులతో పాటు చిన్నాచితకా వ్యాపారస్తులు కూడా రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. చార్మినార్ వైపుకి వెళ్లాలన్నా కూడా ట్రాఫిక్ భయంతో వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఆదివారం వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే క్రమంలో నిన్న ఆదివారం సాయంత్రం ఇద్దరు ఆటో డ్రైవర్లు నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. అప్పటికే వాళ్లు పెద్ద మోతాదులో గంజాయి సేవించారో ఏమో.. ఆ మత్తులో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన అక్కడ రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు, పాదచారులకు భయాందోళన పుట్టించింది. నడిరోడ్డుపై అలా వాళ్లు విచక్షణ రహితంగా కొట్టుకోవడం చూసి అటువైపు వెళ్ళడానికి కొందరు భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆటో పార్కింగ్, ప్యాసింజర్ల విషయంలో మాటలతో మొదలైన వివాదం చివరికి కొట్టుకునే దాకా వచ్చిందని అక్కడ ఈ ఘటనను చూస్తున్న కొందరు చెబుతున్నారు. ఆ ఇద్దరు ఫుల్‌గా గంజాయి సేవించి మత్తులో ఉండడంతో జనాలు ఎవరికీ అడ్డుకునే ధైర్యం చేయలేకపోయారు. కానీ, ఈ ఘటన మొత్తాన్ని కొందరు తమ ఫోన్లలో రికార్డు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ఆపై దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.  ఇతరులకు ఇబ్బంది కలిగించేలా విచక్షణ మరిచి ఇలా ప్రవర్తించే వారిపై ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పైగా ప్రస్తుత కాలంలో గంజాయి వాడకం అధికమైన తరుణంలో యువతను దీని నుంచి దారి మళ్లించాలని, ఆ దిశగా దృష్టి సారించి ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి