ఫ్రస్టేషన్ పీక్ స్టేజ్‌కు చేరింది.. కాంగ్రెస్ నేతపై ఎమ్మెల్యే వాటర్ బాటిల్‌తో దాడి..!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్యా్మ్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగి.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. శ్యామ్ నాయక్‌పై వాటర్ బాటిల్‌తో దాడి చేశారు. ఆయనపైకి వాటర్ బాటిల్లతో విసరడంతో అధికారులు, స్థానిక నేతలు అడ్డుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..