తెల్లాపూర్ క్యాంపస్‌లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ PETA ఇండియా ద్వారా ఆసియాలో మొదటి ‘ఎల్లీ’ వర్క్‌షాప్‌ను నిర్వహించింది, ఇది కారుణ్య విద్యలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎల్లీ అనే యానిమేట్రానిక్ ఏనుగు ప్రదర్శించబడింది. దీనిలో ఏనుగు బందిఖానాలో ఉన్న సమయంలో ఎదుర్కొనే సవాళ్ల గురించి విద్యార్థులకు బోధించడంలో సహాయపడింది.
ఎల్లీ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిధిగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి , UN ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం గుడ్‌విల్ అంబాసిడర్ అయిన దియా మీర్జా హాజరయ్యారు. ఎల్లీ కథను వివరిస్తూ విద్యార్థులను ఆకట్టుకున్నారు. అంతేకాదు అడవిలో పకృతి అందాల మధ్య స్వేచ్చాగా జీవించే ఏనుగులను స్వేచ్ఛగా జీవించనివ్వమని తెలియజేస్తూ.. స్వేచ్చ ప్రాముఖ్యతను స్టూడెంట్స్ కు తెలియజేశారు. మేరు వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీమతి మేఘన గోరుకంటి జూపల్లి సానుభూతి, దయను పెంపొందించడంలో పాఠశాల పాత్ర ఎంతైనా ఉందని.. ఇది తనకు గర్వకారణం అంటూ గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్ సంపూర్ణ విద్య పట్ల మేరు సంస్థకు ఉన్న నిబద్ధతకు అనుగుణంగా, జంతువుల పట్ల, ఇతరుల పట్ల కరుణతో కూడిన ప్రవర్తనకు ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..