Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రూ.2000 కోట్ల భారీ పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు..

తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది.

Telangana: తెలంగాణలో రూ.2000 కోట్ల భారీ పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు..
Revanth Reddy
Follow us
Sravan Kumar B

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 17, 2024 | 3:21 PM

తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్ గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవనుంది. దావోస్​లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మణి కంటిపూడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.

ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయని అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించటంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

రాబోయే అయిదేండ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించటం సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో మణి కంటిపూడి అన్నారు. హైదరాబాద్‌లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు, పరిశోధన సంస్థల కేంద్రంగా హైదరాబాద్ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్, డివైజ్‌లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషదాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజెన్ కంపెనీకి 20 ఏళ్లకుపైగా అనుభవముంది. ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్​మెంట్‌ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది మీకు తెలుసా..?చీమలు కూడా విశ్రాంతి తీసుకుంటాయట..ఎన్నినిమిషాలో
ఇది మీకు తెలుసా..?చీమలు కూడా విశ్రాంతి తీసుకుంటాయట..ఎన్నినిమిషాలో
మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?
మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..
అంత్యక్రియల్లో అద్భుతం.. చనిపోయి బతికిన మహిళ..!
అంత్యక్రియల్లో అద్భుతం.. చనిపోయి బతికిన మహిళ..!
లవర్‌ను కలిసేందుకు ఒంటరిగా ఆమె ఇంటికి వెళ్లాడు! ఆ తర్వాత..
లవర్‌ను కలిసేందుకు ఒంటరిగా ఆమె ఇంటికి వెళ్లాడు! ఆ తర్వాత..
హిట్‌ 3తో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్న నానీ..
హిట్‌ 3తో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్న నానీ..
అమ్మ చేయిపట్టుకుని మార్కెట్‌కి బయల్దేరినచిన్నారి..అమాంతం గాల్లోకి
అమ్మ చేయిపట్టుకుని మార్కెట్‌కి బయల్దేరినచిన్నారి..అమాంతం గాల్లోకి
పహల్గామ్ ఉడ్రదాడిపై ప్రకాశ్‌రాజ్ రియాక్షన్‌.. ఏమన్నారంటే!
పహల్గామ్ ఉడ్రదాడిపై ప్రకాశ్‌రాజ్ రియాక్షన్‌.. ఏమన్నారంటే!
వరుడి నోట్లో రసుగుల్లా పెట్టి.. పెళ్లి మధ్యలో ప్రియుడితో..!
వరుడి నోట్లో రసుగుల్లా పెట్టి.. పెళ్లి మధ్యలో ప్రియుడితో..!
అందాల గులాబీలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అదరహో అనాల్సిందే..!
అందాల గులాబీలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అదరహో అనాల్సిందే..!