తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?

|

Jul 04, 2024 | 9:29 PM

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ పున: ప్రారంభమై నెల గడుస్తోంది. అలాగే ఇంటర్ కాలేజీలు కూడా స్టార్ట్ కావడమే కాదు.. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల కూడా అడ్మిషన్లు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. జూలై నెలలో తెలుగు రాష్ట్రాలలోని స్కూల్స్, పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?
Students
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ పున: ప్రారంభమై నెల గడుస్తోంది. అలాగే ఇంటర్ కాలేజీలు కూడా స్టార్ట్ కావడమే కాదు.. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల కూడా అడ్మిషన్లు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. జూలై నెలలో తెలుగు రాష్ట్రాలలోని స్కూల్స్, పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి. మరి ఆ సెలవులు ఏయే రోజుల్లో ఇప్పుడు తెలుసుకుందామా..

జూలై నెలలో విద్యార్ధులకు సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు వచ్చాయి. ముందుగా జూలై 7న ఆదివారం సెలవు కాగా, ఆ తర్వాత 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ రెండు రోజులు స్కూల్స్ బంద్ కానున్నాయి. ఇక జూలై 21, 28 ఆదివారాలు. అటు జూలై 27న తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ కారణంగా అఫీషియల్ హాలీడే ప్రకటించింది. అటు జూలై 17 బుధవారం మొహర్రం రోజున కూడా స్కూల్స్‌కి సెలవు ఉంటుంది. ఇలా పండుగలు, సాధారణ సెలవులు కలుపుకుని మొత్తంగా 7 రోజులు విద్యార్ధులకు ఈ నెల సెలవులు రానున్నాయి.

జూలై 7 – ఆదివారం

ఇవి కూడా చదవండి

జూలై 13 – రెండో శనివారం

జూలై 14 – ఆదివారం

జూలై 17 – మొహర్రం

జూలై 21 – ఆదివారం

జూలై 27 – బోనాల పండుగ

జూలై 28 – ఆదివారం

అటు ఏపీలోనూ సరిగ్గా ఈ తేదీల్లోనే సెలవులు ఉండనున్నాయి. అంతేకాకుండా జూలై 7న పూరి జగన్నాథ్ రథయాత్ర కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు సెలవు ఉండొచ్చు. దీంతో మొత్తానికి ఏపీలోని జూలై నెలలో 7 నుంచి 8 రోజుల సెలవులు ఉండొచ్చు.

ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..